తిరుపతి SV Campus లో.. సీసీటీవీ ఫుటేజీలో..(వీడియో)
Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. తిరుమల, అలిపిరి సహా పలు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు తరచూ కనిపిస్తోన్నాయి. వాటిని టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలుగుబంట్లు, ఇతర వణ్యప్రాణుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు. ఇదివరకు అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాల్లో చిరుతలు సంచరించాయి.
తాజాగా తిరుమల గిరులను ఆనుకుని ఉన్న ప్రఖ్యాత శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ చిరుత స్వేచ్ఛగా తిరుగాడింది. ఓ కుక్కను తరమడం కనిపించింది. క్యాంపస్ ఆవరణలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో ఈ చిరుత కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12: 47 నిమిషాలకు ఈ చిరుత కనిపించింది. పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్‌ల మధ్య కొత్త నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలో చిరుత సంచరించింది. అక్కడే ఉన్న ఓ కుక్కను తరిమింది.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని విద్యార్థులు వర్శిటీ అధికారులు, టీటీడీ అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలమంది విద్యార్థులు క్యాంపస్‌లో ఉంటోన్నారు. అలాంటి చోట చిరుత ప్రవేశించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని బంధించడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చిరుత తిరుగాడే ప్రాంతాల్లో బోను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
టీటీడీ అటవీ శాఖ అధికారులు గతంలో క్యాంపస్ ఆవరణలో బోన్లు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు నెలల కిందట ఓ చిరుత బోనులో చిక్కింది. ఇప్పుడు మళ్లీ ఇంకో చిరుత ఎస్వీ యూనివర్శిటీ క్యాంపస్, హాస్టల్ బ్లాక్ ల మధ్య తిరుగాడుతోండటం విద్యార్థులు, సిబ్బందిని భయాందోళనకు గురి చేస్తోంది. రాత్రివేళ ఎవరూ బయటకు తిరగకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఎస్వీ యూనివర్శిటీ అధికారులు విద్యార్థులకు సూచించారు.
-
దర్శనం, టోకెన్ల జారీ, క్యూ లైన్లలో టీటీడీ కీలక మార్పులు- ఈ తేదీ నుంచి అమలు..!! -
అలిపిరితో పాటు తిరుమలలో -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications