బంగాళాఖాతంపై ఉపరితల ద్రోణి- ఏపీకి వర్ష సూచన
రుతుపవనాలతో సంబంధం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు చలికాలం, వేసవిలోనూ అసాధారణంగా వాతావరణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. వాతావరణం ఎప్పుడు మారుతుందో అంచనా వేయడం కష్టతరంగా మారింది. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేశాయి. ఈ పరిణామాలు కొన్ని చోట్ల వర్షాలకు కారణమౌతోండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతకు దారి తీస్తోంది.
తాజాగా పశ్చిమ- మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది చురుకుగా కదులుతోంది. ఇది మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల పాటు.. అంటే ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి చెదురుమదురుగా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రత్యేకించి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని హెచ్చరించింది. బలమైన గాలుల వల్ల కొమ్మలు విరిగిపడొచ్చని, పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
హోర్డింగ్‌లు, కటౌట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో మార్చి మధ్యలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత కొనసాగే అవకాశం ఉంది. 16 తర్వాత అకాల వర్షాలు ప్రారంభమవుతాయని 'తెలంగాణ వెదర్‌మ్యాన్' సూచించారు. మార్చి 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. గత నెలలో కురిసిన వర్షాల కంటే ఈసారి భారీగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications