జైల్లో భాను కిరణ్ వద్ద మద్యం బాటిళ్లు, బిర్యానీ

మీడియా కథనాల ప్రకారం - బుధవారం ఉదయం భానుకిరణ్ ఉన్న బ్యారెక్‌లో డిప్యూటీ జైలర్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భానుకిరణ్ వద్ద ఉన్న బిర్యానీ ప్యాకెట్లు, రెండు మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సిబ్బంది పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా భాను కిరణ్ నుంచి మద్యం బాటిళ్లను, బిర్యానీ ప్యాకెట్లను, సెల్ ఫోన్లను, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ తనిఖీలు నిర్వహించి బాధ్యులపై వేటు వేసినా ఫలితం కనిపించడం లేదని అంటున్నారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్ అరెస్టయిన విషయం తెలిసిందే. భాను కిరణ్‌కు భూదందాలతో సంబంధం ఉన్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications