మద్యం అమ్మకాల్లో బిగ్ ట్విస్ట్, కొత్త లెక్కలు..!!
ఏపీలో మద్యం అమ్మకాల లెక్కలు ఆసక్తి కరంగా మారాయి. కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చిన తరువాత సేల్స్ పెరిగాయి. రూ 99 లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. బ్రాండెడ్ మద్యం తిరిగి ప్రవేశ పెట్టారు. అయితే, తొలి ఏడాది కంటే ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అమ్మకాలు పెరిగినా... ఆదాయం మాత్రం కిందటి ఏడాదితో పోల్చితే తగ్గింది. అదే విధంగా ప్రస్తుతం దీక్షల ప్రభావం సైతం మద్యం అమ్మకాల పైన పడింది. దీంతో.. లెక్క మారింది.
ఏపీలో మద్యం అమ్మకాల్లో సాధారణంగా ప్రతీ ఏటా ఏటా 8 నుంచి 10శాతం వరకు వృద్ధి రేటు నమోదవుతుంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5శాతానికే పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో రూ.19,268 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,216 కోట్ల మద్యం విక్రయించారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాల విలువ 5 శాతం పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే లిక్కర్ 6శాతం, బీరు 24శాతం అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, మార్కెట్‌లోకి రూ.99 లిక్కర్ బ్రాండ్లు రావడం, కూటమి ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగిన స్థాయిలో వాటిపై ఆదాయం పెరగలేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గినట్లు ప్రస్తుత లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

కాగా, ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో నెలకు సగటున రూ.2,527 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. రెండు నెలల కిందటి వరకు అమ్మకాల్లో జోరు కనిపించింది. నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్టు షాపులు పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఒక్క అక్టోబరులోనే రూ.430 కోట్ల మేరకు అమ్మకాలు తగ్గాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాది నవంబరులో అమ్మకాలు రూ.46 కోట్లు తగ్గాయి. మొత్తంగా ఎనిమిది నెలల్లో గతేడాదితో పోలిస్తే రూ.948 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి. 2024-25లో సుమారు రూ.30 వేల కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మరో నాలుగు నెలలు ఉండగా రూ.20 వేల కోట్లు దాటింది. దీంతో సగటు అమ్మకాలను పరిశీలిస్తే మిగిలిన నెలల్లో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.30 వేల కోట్లు దాటుతాయనే అంచనా ఉంది.
ఈ ఏడాది ఆ ఆదాయం లోటు కనిపిస్తోంది. కొత్త బార్ పాలసీ వచ్చినా చెప్పుకోదగ్గ ఆదాయం దరఖాస్తుల రూపంలో రాలేదు. పైగా దాదాపు 300 బార్లకు దరఖాస్తులు రాలేదు. అక్టోబరులో కేవలం నాలుగు జిల్లాల్లోనే అమ్మకాలు పెరిగాయి. ఇక, నవంబరులో ఆ సంఖ్య 11కు చేరింది. మిగిలిన 15 జిల్లాల్లో మాత్రం అమ్మకాలు తగ్గాయి. అయ్యప్ప, భవానీ దీక్షల ప్రభావం కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాలో 11.56 శాతం, ఎన్టీఆర్‌లో 10.32 శాతం, తూర్పుగోదావరిలో 8.75 శాతం, తిరుపతిలో 6.55 శాతం, కడపలో 6.23 శాతం, గుంటూరులో 5.97 శాతం, బాపట్లలో 5.9 శాతం, కాకినాడలో 4.91 శాతం, శ్రీకాకుళంలో 4.43 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. కర్నూలు, అల్లూరి సీతారామరాజు, సత్యసాయి జిల్లాల్లో అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
-
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications