ఏపీలో టాప్-12 నియోజవర్గాలు ఇవే!.. జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టాప్-12 నియోజకవర్గాల జాబితాను విడుదల చేసింది.
విజయవాడ: ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం, గ్రాస్ వాల్యూ ఆడిట్ (జీవీఏ), నీరు-ప్రగతి, మీకోసం ఫిర్యాదుల పరిష్కారం, ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, రహదారుల అభివృద్ది వంటి తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం టాప్ నియోజవర్గాలను ఎంపిక చేసింది.

ఇందులో మొదటి నాలుగు స్థానాలు పశ్చిమగోదావరి జిల్లావే కావడం విశేషం. జిల్లాలోని గోపాలపురం,భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలు టాప్-4 నియోజకవర్గాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక 5వ స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట, 6వ స్థానంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఉన్నాయి.
7వ స్థానంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట, 8,9 స్థానాల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు, తణుకు చోటు దక్కించుకున్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రాజమండ్రి, అనంతపురంలోని శింగనమల, విశాఖ వెస్ట్ నియోజకవర్గాలు నిలిచాయి.












Click it and Unblock the Notifications