Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీంలో ప్రస్తావన..!!

చంద్రబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ స్కాంలో చంద్రబాబు(Chandra Babu) క్వాష్ పిటీషన్ ను చంద్రబాబు న్యాయవాది సిద్దార్ధ లూద్ర సీజేఐ బెంచ్(CJI Bench) వద్ద ప్రస్తావించారు. దీంతో స్పందించిన సీజే రేపు మెన్షన్ లిస్టులో చేరుస్తామని చెప్పారు. దీంతో, చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణ ఎప్పుడనేది రేపు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారని..వెంటనే విచారణ చేయాలని లూధ్రా సీజేను కోరారు.

రేపు మెన్షన్ చేయాలని:చంద్రబాబు రిమాండ్ గురించి సుప్రీం సీజేఐ(CJI) వద్ద ప్రస్తావనకు వచ్చింది. న్యాయవాది సిద్దార్ధ లూద్ర ప్రస్తావన చేయటంతో..చంద్రబాబు ఎప్పటి నుంచి రిమాండ్ లో ఉన్నారని సీజేఐ(CJI) న్యాయవాది లూధ్రాను ప్రశ్నించారు. దీంతో, రేపు మెన్షన్ చేసిన తరువాత విచారణ ఎప్పుడనేది రేపు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఏపీ హైకోర్టు(AP High Court)లో క్వాష్ పిటీషన్ కొట్టివేయటంతో ఈ తీర్పు పైన చంద్రబాబు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ నెల 28వ తేది నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు కావటంతో, ఈ లోగానే విచారణకు నిర్ణయిస్తారా లేదా తరువాత ఉంటుందా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది.

Little more wait for Chandra Babu, CJI post pone the hearing time for over quash petition

సుప్రీంలో ఎస్ఎల్పీ:సుప్రీంలో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పైన రేపు స్పష్టత రానుంది. ఇక, మరోవైపు ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటీషన్ (Bail Petition) విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల సీఐడీ కస్టడీ (CID Custody) ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ(CID) అధికారులు మెమో దాఖలు చేశారు. కస్టడీ పొడిగింపు పిటీషన్‌పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది పోసాని నిన్ననే కోరారు. ఈ రోజు మెమోపై కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది. బెయిల్ పిటీషన పైన సమయం కావాలని సీఐడీ కోరుతున్నట్లు తెలుస్తోంది.

బెయిల్ పై విచారణ:అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది. కాగా సుప్రీం కోర్టు (Supreme Court)లో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్‌పై ఏమి జరుగుతుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ హైకోర్టు(AP High Court)లో ఈ రోజునే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్..ఫైబర్ గ్రిడ్ స్కాం, అంగల్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ పైన విచారణ జరగనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+