Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

ఆదివారం రోజున గోదావరి నదిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇప్పటికే రెండు హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. లోతు ఎక్కువగా ఉన్నందున గల్లంతైన వారికోసం వెతికేందుకు సోనార్ స్కానర్లను వినియోగిస్తున్నారు. ఇక అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు తెలంగాణ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజమండ్రికి వెళ్లారు. ఇప్పటికే పలువురు ఏపీ మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.సీఎంతో పాటు రాష్ట్ర హోంమంత్రి సుచరిత కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీసినట్లు సమాచారం.

ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు సహాయక చర్యలను స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. వెంటనే బోటు అనుమతులు సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా విపత్తు నిర్వహణల శాఖ ఎప్పటి కప్పుడు ఘటనా స్థలిలో జరుగుతన్న చర్యల గురించి ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు.సహాయక చర్యలు..మునిగిన బోటును వెలికి తీసిన తరువాత ప్రభుత్వం దీని మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే..ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన మీద సీరియస్ గా ఉన్నారు.

Live updates:Boat accident in East Godavari district of AP

Sep 16, 2019, 12:09 pm IST

బోటు మునగడానికి 5 నిమిషాల ముందు అందరూ సంతోషంలో.. అంతలో
Sep 16, 2019, 11:30 am IST

బోటులోనే ఎక్కువ మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నా:ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
Sep 16, 2019, 11:29 am IST

రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాదం బాధితులను పరామర్శించిన సీఎం జగన్. ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
Sep 16, 2019, 11:17 am IST

బోటు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు రాజమండ్రి ఆస్పత్రికి చేరుకున్న ఏపీ సీఎం జగన్
Sep 16, 2019, 11:14 am IST

ఇంకా 24 మంది ఆచూకీ లభించాల్సి ఉంది: విపత్తుల శాఖ కమిషనర్
Sep 16, 2019, 11:09 am IST

సైడ్ స్కాన్ సోనార్, ఇతర అధునాతన పరికరాలతో వస్తున్న బృందం: విపత్తుల శాఖ కమిషనర్
Sep 16, 2019, 11:09 am IST

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఉత్తరాఖండ్ ప్రత్యేక బృందం: విపత్తుల శాఖ కమిషనర్
Sep 16, 2019, 11:01 am IST

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు మృతదేహాలను గుర్తించాం: మంత్రి ఎర్రబెల్లి
Sep 16, 2019, 11:01 am IST

9 మంది ఆచూకీ లభించాల్సి ఉంది: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
Sep 16, 2019, 11:00 am IST

వరంగల్ నుంచి 14 మంది వచ్చారు: మంత్రి ఎర్రబెల్లి
Sep 16, 2019, 11:00 am IST

బోటు ప్రమాదంలో హయత్‌నగర్ వాసులు, ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న బంధువులు
Sep 16, 2019, 10:59 am IST

పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తామన్న కలెక్టర్ మురళీధర్ రెడ్డి
Sep 16, 2019, 10:58 am IST

పోస్టుమార్టం కోసం మృతదేహాలను జీజీహెచ్‌కు తరలింపు: తూ.గో కలెక్టర్
Sep 16, 2019, 10:58 am IST

బోటు ప్రమాద ఘటనై చర్యలకు సిద్ధమైన ఇరిగేషన్ అధికారులు
Sep 16, 2019, 10:52 am IST

సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, నేవీ, గజఈతగాళ్లు
Sep 16, 2019, 10:51 am IST

37 మంది పర్యాటకలు ఆచూకీ గల్లంతు
Sep 16, 2019, 10:51 am IST

బోటు ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు యువఇంజినీర్లు, బయటపడ్డ ఐధుమంది యువ ఇంజనీర్లు
Sep 16, 2019, 10:47 am IST

కంట్రోల్ రూం నెంబర్లు రంపచోడవరం ఆర్డీఓ : 08857245166 విశాఖ కలెక్టరేట్: 180042500002 పశ్చిమగోదావరి కలెక్టరేట్: 18002331077 మచిలీపట్నం కటెక్టరేట్: 08672252847
Sep 16, 2019, 10:45 am IST

కంట్రోల్ రూం నెంబర్లు: రంపచోడవరం: 18004252123 అమలాపురం ఆర్డీఓ: 08856233100 కాకినాడ ఆర్డీఓ: 08842368100
Sep 16, 2019, 10:44 am IST

కంట్రోల్ రూం నెంబర్లు: కాకినాడ: 18004253077 రాజమండ్రి: 08832442344 ఎటపాక సబ్ కలెక్టరేట్ : 08748285279
Sep 16, 2019, 10:42 am IST

బోటు ప్రమాద వివరాలకోసం ఏపీలో పలుచోట్ల కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Sep 16, 2019, 10:39 am IST

మరికాసేపట్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్
Sep 16, 2019, 10:39 am IST

కుచ్చులూరు సమీపంలో మరో నాలుగు మృతదేహాలు వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
Sep 16, 2019, 10:38 am IST

గోదావరి పడవ మునిగిన ప్రాంతంలో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+