స్థానిక ఎన్నికలు అప్పుడే - ఎన్నికల సంఘం క్లారిటీ..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఇప్పటికే హైకోర్టు నిర్దేశించిన ఆరు వారాల గడువు లోగా ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కాగా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మందు జరగాల్సిన ప్రక్రియ పైన ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టత ఇస్తున్నాయి. రాజకీయ పార్టీలతో సమావేశం..ఆ వెంటనే షెడ్యూల్ విడుదల దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
స్థానిక ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ తో పాటుగా ఎన్నికల నిర్వహణకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. బీసీ రిజర్వేషన్ల పైన ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఇదే అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. స్థానిక ఎన్నిక ల అంశం పైన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక ఉత్తర్వు లు జారీ చేస్తూ, ఎన్నికల ఆలస్యానికి తావులేకుండా ముందుకు వెళ్లాలని ఆదేశించింది. దీంతో.. ఎన్నికల సంఘం తరువాతి ప్రక్రియ పైన ఫోకస్ చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.

రిజర్వేషన్ల ఖరారు తరువాత షెడ్యూల్
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆ నోటిఫికేషన్ తరువాత రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించా ల్సి ఉంటుంది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా.. ఎన్నికల జాబితా పైనా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R)' ప్రక్రియ పూర్తయితే, కొత్తగా రూపొందించిన సమగ్ర ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ నోటిఫికేషన్ సమయానికి SIR ప్రక్రియ పూర్తి కాకపోతే, ప్రస్తుత పాత ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో నిర్దేశించిన పరిమితి ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకూడదని పునరుద్ఘాటించింది. దీంతో, ఎన్నికల సంఘం స్థానిక
షెడ్యూల్ విడుదల చేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.













Click it and Unblock the Notifications
