Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుపై సంచలనం: జగన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సాధారణ వ్యక్తి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భాషా అనే వ్యక్తి గురువారం దిమ్మతిరిగే షాకిచ్చారు. సేవ్ విశాఖ పేరుతో జగన్ మహా ధర్నా పేరతో బహిరంగ సభ నిర్వహించిన విషయం

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భాషా అనే వ్యక్తి గురువారం దిమ్మతిరిగే షాకిచ్చారు. సేవ్ విశాఖ పేరుతో జగన్ మహా ధర్నా పేరతో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా జగన్ పలువురితో మాట్లాడించారు. మహాధర్నా అనంతరం జగన్ భూములు కోల్పోయిన కొందరు రైతులతో మాట్లాడించారు. ఈ సందర్భంగా భాషా అనే వ్యక్తి మాట్లాడారు.

జగన్‌కు భాషా ఎలా షాకిచ్చారంటే..

జగన్‌కు భాషా ఎలా షాకిచ్చారంటే..

తనకు 2005లో భూ పట్టా కేటాయించారని, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని భాషా చెప్పారు. కానీ 2008లో అప్పటి కాంగ్రెస్ నేతలు తన భూమిని లాక్కున్నారని చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు..

వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు..

2008లో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. భాషా చెప్పిన విషయం పై జగన్ స్పందించలేదు. భాషా మాత్రమే కాకుండా మరికొందరు రైతులు కూడా కాంగ్రెస్ హయాంలోనే భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేశారు.

జగన్ తీవ్ర ఆరోపణలు

జగన్ తీవ్ర ఆరోపణలు

కాగా, విశాఖలో భూఆక్రమణలు పెచ్చుమీరాయని జగన్‌ మహాధర్నా సందర్భంగా ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా భూములు ఆక్రమించుకుంటున్నారన్నారు. విశాఖ భూస్కాంలో చంద్రబాబు నుంచి అధికారుల పాత్ర ఉందని, మంత్రులు లోకేష్, గంటా శ్రీనివాస రావులు నీకింత, నాకింత అని పంచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదే వేదికపై జగన్‌కు సాధారణ రైతు షాకివ్వడం గమనార్హం.

బాధితులతో మాట్లాడి...

బాధితులతో మాట్లాడి...

భూమి బాధితులతో మాట్లాడిన జగన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పెద్దలు పేదలను బెదిరించి భూములు లాక్కుంటున్నారని, ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రికి కూడా ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+