లాకప్ డెత్: కుటుంబ సభ్యుల ఆందోళన (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖపట్నంలోని రెల్లి వీధికి చెందిన నల్లయ్య మృతిపై ఆయన కటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో నల్లయ్య మృతికి దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసు కమిషనర్ అమిత్ గార్డ్ నిర్ణయించారు. ఈ నేరకు ఆయన డిసిపి రవి కుమార్ మూర్తికి ఆదేశాలు జారీ చేశారు.
విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లోని ద్వారకా జోన్ మొదటి అంతస్తులోంచి నిందితుడు నల్లయ్య తప్పించుకుని రెండు కిలోమీటర్ల దూరం పరుగెత్తాడనే పోలీసుల వాదనను అతని కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతున్నారు. నల్లయ్యను పోలీసులే చిత్రహింసలు పెట్టారని, దానివల్లనే అతను మరణించాడని ఆయన భార్య, కుమారుడు కూతురు ఆరోపించారు.
నల్లయ్య పోలీసు స్టేషన్‌లోనే చనిపోయాడనే ఆరోపణలపై పోలీసులు అధికారులు స్పందించారు. కస్టోడియల్ మరణాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నట్లు వారు చెప్పారు. శవపరీక్షను ఒక వైద్యుడితో కాకుండా వైద్యుల బృందంతో చేయించినట్లు కూడా తెలిపారు. శవపరీక్షను వీడియో తీయించామని కూడా అన్నారు.

కుటుంబ సభ్యుల ఆందోళన
వాసుపల్లి నల్లయ్య మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు బుధవారంనాడు కెజిహెచ్ శవాగారం వద్ద నిరసనకు దిగారు. వీరికి ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్య వేదిక నాయకుడు జెటి రామారావు మద్దతు ఇచ్చారు.

కుటుంబ సభ్యుల ఆందోళన
నల్లయ్య మృతి కేసును మానవ హక్కుల కమిషన్‌కు అప్పగించాలని, బాధ్యులను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

కుటుంబ సభ్యుల ఆందోళన
కుటుంబ సభ్యుల ఆందోళన గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు శవాగారం వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. నల్లయ్య మృతి నేపథ్యానికి సంబంధించిన పరిణామ క్రమాలను వివరించి శాంతింపజేశారు.

గుర్తు తెలియని శవంగా..
తొలుత గుర్తు తెలియని మృతదేహంగా లభ్యమైనట్లు కేసు నమోదు చేశామని నాలుగో పట్టణం క్రైం సిఐ కెవి బాలకృష్ట చెప్పారు. తర్వాత కస్టోడియల్ వ్యక్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆర్డీవోకు వివరాలు అందించామని అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications