• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీ కొత్త వ్యూహం, కాంగ్రెస్‌కు ఝలక్: సీఎంతోనే.. జైట్లీ-మోడీ ఎదుట చేతులెత్తేసిన సుజన

|

న్యూఢిల్లీ: అధికార పార్టీయే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో లోకసభలో ఆందోళనలు చేయిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే మంగళవారం సభలో ఆరోపించారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని, వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ, వైసీపీ ఎంపీలు సభలో ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

  BJP Plans To Join Hands With Jagan, Ignoring Chandrababu

  వీ వాంట్ జస్టిస్, సేవ్ ఆంధ్ర ప్రదేశ్, ఏపీకి న్యాయం జరగాలని ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం కూడా లంచ్ తర్వాత మరో అరగంట వాయిదా పడింది. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

  ప్రభుత్వమే చేయిస్తోందని ఖర్గే

  ప్రభుత్వమే చేయిస్తోందని ఖర్గే

  దీంతో ఖర్గే టీడీపీ ఎంపీలపై మండిపడ్డారు. ప్రభుత్వమే వీరితో ఆందోళనలు చేయిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఆడిస్తున్న డ్రామా అన్నారు. ఖర్గే ఎదుట ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీలు, ఖర్గేకు వాగ్వాదం జరిగింది. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్ చెప్పినా టీడీపీ ఎంపీలు తమ ఆందోళన విరమించలేదు. దీంతో సభ వాయిదా పడింది.

  లోకసభలో ఎంపీల 'గోవిందా.. గోవిందా': ఏపీపై కేంద్రమంత్రి ఇలా, వెంకయ్య పిలిస్తే టీడీపీ నో

  కాంగ్రెస్ సభ్యులను అడ్డుకుంటూ టీడీపీ కొత్త వ్యూహం

  కాంగ్రెస్ సభ్యులను అడ్డుకుంటూ టీడీపీ కొత్త వ్యూహం

  తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో కొత్త వ్యూహానికి తెరలేపింది. ఇప్పటి ఏపీ హామీల విషయంలో ఇప్పటి వరకు బీజేపీని నిలదీస్తూ, బయట కాంగ్రెస్ పార్టీని కూడా టీడీపీ విమర్శిస్తోంది. అయితే మంగళవారం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లింది. సభలోను కాంగ్రెస్ సభ్యులను అడ్డుకుంది. అందుకు ఖర్గే ప్రసంగానికి అడ్డుపడటమే నిదర్శనం. ఏపీకి ఇచ్చిన విభజన హామీల విషయంలో కేంద్రంతో అమలు చేయించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా కాంగ్రెస్ పైన ఉందని అభిప్రాయపడుతూ ఈ వ్యూహంతో ముందుకు వచ్చింది.

  ప్రధాని మోడీతో సుజనా చౌదరి భేటీ: ఏపీ హామీలపై టీడీపీ ఎంపీల కొత్త ఎత్తు

  ఆపేది లేదు, కావాలంటే సీఎంతో మాట్లాడుకోండి: జైట్లీకి సుజన

  ఆపేది లేదు, కావాలంటే సీఎంతో మాట్లాడుకోండి: జైట్లీకి సుజన

  పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నిరసన ఆపాలని, చర్చలకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. అయితే ఎంపీలు ససేమీరా అన్నారు. ఆందోళన విరమించాలని జైట్లీ.. సుజనను కూడా కోరారు. తమ నిరసన ఆపేది లేదని, కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుకోవాలని సుజన సూటిగా చెప్పారు.

  మేం మీ వెంటే ఉంటున్నాం

  మేం మీ వెంటే ఉంటున్నాం

  అంతకుముందు, ప్రధాని మోడీ ఎదుట సుజన చేతులెత్తేశారు. ఆందోళన విరమించే అంశం తన చేతుల్లో లేదని మోడీకి చెప్పారు. ప్రధానిగా మీరు ప్రమాణస్వీకారం చేసిన సమయం నుంచి నేటి వరకు మిత్రపక్షంగా మేము మీకు సహకరిస్తున్నామని, అన్ని విషయాల్లోనూ మీ వెంటే ఉన్నామని, అయితే దీనికి భిన్నంగా కేంద్రం ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుజన.. మోడీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

  అది నా చేతుల్లో లేదని సుజన

  అది నా చేతుల్లో లేదని సుజన

  ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఏడాది పూర్తయినా అమలుకు నోచుకోలేదని మోడీకి సుజన చెప్పారు. మరోవైపు చాలా రాష్ట్రాలకు జీఎస్టీ తర్వాత కూడా హోదా కొనసాగిస్తున్నారని, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరిస్తున్నా ఏపీ విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోందన్నారు. రాజధాని శంకుస్థాపన సమయంలో ఇచ్చిన వాగ్ధానాలన్నీ పక్కకు పోయాయని, ఇటీవల చంద్రబాబు మిమ్మల్ని కలిసి అనేక విషయాలు ప్రస్తావించారని, వాటిలో ఒక్క విషయంలోనూ పురోగతి లేదని వాపోయారు. మోడీతో సుజన అరగంటకు పైగా మాట్లాడారు. ఆందోళన విరమించాలని మోడీ సూచించగా.. అది తన చేతుల్లో లేదని చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Vociferous protests by members of NDA ally Telugu Desam Party today forced brief adjournment of Lok Sabha proceedings as they demanded special facilities for Andhra Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more