రేపీ పాటికి ఏపీలో రచ్చ రచ్చే..!!

Lok Sabha elections 2024 Phase 7: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.

చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

Lok Sabha elections Phase 7 Exit polls 2024 to be out after the voting on June 1

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6: 30 గంటలకు అధికారికంగా పోలింగ్ ముగుస్తుంది. అప్పటివరకు క్యూలో ఉన్న వారికి ఓటు వినియోగించుకునే అవకాశం ఇస్తారు పోలింగ్ సిబ్బంది.

కాగా సాయంత్రం 6:30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలవుతుంది. మే 13వ తేదీన ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కసారిగా వెలువడటం ప్రారంభమౌతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చు.

ఇండియాటుడే- మైయాక్సిస్, చాణక్య, ఇండియా టీవీ, న్యూస్ 18, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ.. వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించబోతోన్నాయి. శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఆరా మస్తాన్.. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు కూడా.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని మద్దిరాల గ్రామంలో ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు ఆరా మస్తాన్. ఏపీ, తెలంగాణ ఎన్నికలపై తాను నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేస్తారు. ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీదే నిలిచాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+