వారంలో 6 రోజులు గుంటూరులోనే చినబాబు లోకేష్ మకాం...పార్టీ క్యాడర్ కు అందుబాటులో చినబాబు

గుంటూరు.టిడిపి వ్యవహారాలను అన్ని తానై చూస్తోన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .....పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యేందుకు గుంటూరు కేంద్రంగా పనిచేయనున్నారు.ప్రభుత్వ వ్యవహారాల్లో నిత్యం బిజీగా ఉంటున్న ఎపి సిఎం చంద్రబాబునాయుడు పార్టీ వ్యవహారాలు ఎక్కువగా చినబాబు లోకేష్ కు అప్పగిస్తున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు మరింత చేరువగా నాయకత్వం ఉండాలనే సూచన రావడంతో గుంటూరు కేంద్రంగా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబునాయుడు సూచించారు.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర సమయం నుండి లోకేష్ పార్టీ వ్యవహారాలను చూడడం ప్రారంభించారు.తొలుత యువతతో తర్వాతి కాలంలో సీనియర్లతో కూడ చినబాబు సమావేశాలు నిర్వహించేవారు. ఎన్నికల తర్వాత అవశేష ఆంద్రప్రదేశ్ లో టిడిపి అధికారంలోకి వచ్చింది.ఎపిలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ప్రభుత్వ వ్యవహారాల్లో చంద్రబాబు నిత్యం బిజీగా ఉంటున్నారు.పార్టీ వ్యవహారాలకు అధిక సమయం కేటాయించడం లేదు. ఎపి రాజధాని గుంటూరులో టిడిపి తాత్కాలిక రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.ఈ కార్యాలయంలో పార్టీ క్యాడర్ కు చినబాబు అందుబాటులో ఉండేలా వ్యూహారచన చేస్తున్నారు.

lokesh available for party cadre at Guntur tdp office

గుంటూరు కేంద్రంగా రెండు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులకు వేర్వేరుగా శిక్షణ కార్యక్రమాలు ఇటీవల నిర్వహించారు.అయితే ఆంద్రప్రదేశ్ లోని పార్టీ క్షేత్రస్థఆయి క్యాడర్ కు అందుబాటులో ఉండాలని చినబాబును చంద్రబాబు ఆదేశించారు.ఎన్ టి ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ...పార్టీకి చంద్రబాబునాయుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.ఈ సమయంలో పార్టీపై బాబు పట్టు పెంచుకొన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు బాబుకు అవగాహాన ఉంది. .పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం 1995 పార్టీ సంక్షోభ సమయంలో బాబుకు కలిసివచ్చిందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

పార్టీపై క్షేత్ర స్థాయి నుండి పట్టు ఉంటే ఇబ్బందికర సమయాల్లో పార్టీకి ఉపయోగంగా ఉంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.ఎపిలో పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్న కారణంగా గుంటూరు పార్టీ కార్యాలయం కేంద్రం వారానికి 6 రోజుల పాటు అందుబాటులో ఉండాలని చంద్రబాబు చినబాబుకు సూచించారు.క్యాడర్ తో ఏ రకంగా ఉండాలి...సీనియర్ నాయకులతో ఎలా వ్యవహారించాలనే దానిపై చంద్రబాబు చినబాబుకు సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+