వాళ్ళు సంపాదిస్తే ఖర్చుచేస్తున్నాం, రాజకీయాల్లోకి రావడం బ్రహ్మిణి ఇష్టం: లోకేష్
వాషింగ్టన్: రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనే విషయాన్ని బ్రహ్మిణి తీసుకొంటారని, ఆ విషయంలో తన బలవంతం ఏమీ ఉండదని ఏపీ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు.
అమెరికా పర్యటనలో ఉన్న నారాలోకేష్ విదేశీ టిడిపి సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేఖ అనే మహిళ బ్రహ్మిణి రాజకీయ రంగ ప్రవేశం గురించి లోకేష్‌ను ప్రశ్నించారు. దీంతో లోకేష్ ఈ విషయమై తన సమాధానాన్ని చెప్పారు.
దావోస్ పర్యటనను ముగించుకొని విదేశాల్లోనే లోకేష్ పర్యటిస్తున్నారు. విదేశాల్లోని టిడిపి పార్టీ కమిటీలతో లోకేష్ సమావేశమౌతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఎన్ఆర్‌ఐలను లోకేష్ ఆహ్వనిస్తున్నారు.

రాజకీయాల్లోకి రావాలో వద్దో బ్రహ్మిణి నిర్ణయించుకొంటారు
రాజకీయాల్లోకి రావాలో వద్దో బ్రహ్మిణి నిర్ణయించుకొంటారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆమెకు ఇష్టమైతే నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. ఆమె ఏ నిర్ణయం తీసుకొన్నా తాము వ్యతిరేకించబోమని చెప్పారు.

బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చు పెడుతున్నాం
మహిళా సాధికారితలో తమ కుటుంబం ముందుందని లోకేష్ చెప్పారు. అమ్మ, బ్రహ్మిణి సంపాదిస్తుంటే ఆ డబ్బులను నేను నాన్న ఖర్చు పెడుతున్నట్టు నారా లోకేష్ చెప్పారు. హెరిటేజ్ సంస్థలో భువనేశ్వరి, బ్రహ్మిణి నడుపుతున్నారు. దీంతోనే లోకేష్ నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నన్ను కూడ రాజకీయాల్లోకి రావాలనే ఎవరూ కోరలేదు
తాను కూడ రాజకీయాల్లోకి రావాలని ఎవరూ కూడ కోరలేదని నారా లోకేష్ చెప్పారు. అయితే తానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా నారాలోకేష్ చెప్పారు. హెరిటేజ్ సంస్థలో బాధ్యతలను వదులుకొని లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత లోకేష్ గత ఏడాది ఏప్రిల్ మాసంలో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మీ నిర్ణయాన్ని బ్రహ్మిణి చెబుతా
రాజకీయాల్లోకి బ్రహ్మిణి రావాలని తాము కోరుకొంటున్నట్టు ఎన్ఆర్‌ఐ మహిళా రేఖ లోకేష్ దృష్టికి తెచ్చారు. అయితే ఈ విషయాన్ని తాను బ్రహ్మిణి దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు ప్రకటించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications