జ‌గ‌న్‌కు లోకేష్ ఛాలెంజ్‌ : మీ బాబు మా బాబుపై 26 కేసులు వేసారు: మీ త‌రం కాదు..మీ జైలు జీవితం...!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ ఛాలెంజ్ చేసారు. చంద్రబాబు హ‌యాంలో జ‌రిగిన అవినీతి పైన జ‌గ‌న్ తాజాగా కేబినెట్ స‌బ్‌క‌మిటీ వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీని పైన లోకేశ్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.ఈ ట్వీట్‌లో జ‌గ‌న్ కేసుల గురించి ప్ర‌స్తావించారు. అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితు డి గా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్ అంటూ పోస్ట్ చేసారు. అదే విధంగా మీ బాబు..మా బాబు అంటూ పోస్టింగ్‌లో వ్యాఖ్య‌లు కొన‌సాగించారు.

మీ బాబు..మా బాబు..మీ త‌రం కాదు..

మీ బాబు..మా బాబు..మీ త‌రం కాదు..

టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ సంచ‌ల‌న ట్వీట్ చేసారు. మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది..అంటూ ట్వీట్ చేసారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యం లో జ‌రిగిన అవినీతి పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేసారు. టీడీపీ ప్ర‌భుత్వం నాడు తీసుకున్న నిర్ణ‌యాలు..వాటిలో జ‌రిగిన అక్ర‌మాల‌ను వెలుగులోకి తేవాల‌ని ఆదేశించారు. ఇందు కోసం ఆరు వారాల స‌మ‌యం కేటాయించారు. దీని పైన టీడీపీ నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. నాడు వైయ‌స్ హ‌యాంలో ఏర్పాటు చేసిన క‌మిటీలు..ఏఏ అంశాల మీద ఈ విచార‌ణ క‌మిటీలు వేసార‌నే వివ‌రాల‌ను లోకేశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసారు. వాటికి సంబంధించి ఎన్ని క‌మిటీలు విచారించిందీ వివ‌రించారు.

జ‌గ‌న్ కేసుల గురించీ ఇలా..

జ‌గ‌న్ కేసుల గురించీ ఇలా..

లోకేశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో జ‌గ‌న్‌ను ఉద్దేశించి మ‌రో కీల‌క వ్యాఖ్య చేసారు. అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌..అంటూ పోస్ట్ చేసారు. ప‌వ‌ర్ ప్రాజెక్టుల విష‌యంలో నాటి ముఖ్య‌మంత్రి మొద‌లు ఎవ‌రు త‌ప్పు చేస్తే వారిపైనా న్యాయ‌ప‌ర‌మైన చర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. దీని పైనా లోకేశ్ స్పందించారు. జ‌గ‌న్ పైన గ‌తంలో పెట్టిన కేసులు..ఆయ‌న జైళ్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసారు. అటువంటి కేసులు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ ఇప్పుడు నీతి- నిజాయితీ అంటూ మాట్లాడుతుండ‌టం పైన లోకేశ్ ప్ర‌శ్నించారు. అయితే, జ‌గ‌న్ ఈ కేసుల పైన అనేక సంద‌ర్భాల్లో స‌మాధానం ఇచ్చారు. అవ‌న్నీ నాడు కాంగ్రెస్..టీడీపీ క‌లిసి అక్ర‌మంగా న‌మోదు చేసిన కేసుల‌ని..సీబీఐ విచార‌ణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పైన ఎటువంటి అభియోగాలు నిర్ధార‌ణ కాలేద‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌చ్చారు.

జ‌గ‌న్ పైకి లోకేశ్‌ను ప్ర‌యోగిస్తున్నారా..

జ‌గ‌న్ పైకి లోకేశ్‌ను ప్ర‌యోగిస్తున్నారా..

రెండు రోజులుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు ఈ నెల రోజుల జ‌గ‌న్ పాల‌న మీద ఎక్క‌డా స్పందించ‌లేదు. ఆయ‌న త‌న పార్టీ నేత‌ల‌తోనే ప్ర‌తీ సంద‌ర్భంలోనూ మాట్లాడి స్తున్నారు. ఇక‌, తాజాగా జ‌గ‌న్ నిర్ణ‌యాల పైన చంద్ర‌బాబు వెనుక ఉండి లోకేశ్ ద్వారా మాట్లాడిస్తున్నారా అనే సందేహం మొద‌లైంది. అందులో భాగంగానే లోకేశ్ సైతం మీడియా ముందు కాకుండా ట్విట్ట‌ర్ ద్వారా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ విష‌యంలో తాము వెన‌క్కు త‌గ్గేది లేద‌ని సంకేతాలు ఇచ్చేలా నేరుగా లోకేశ్ ముఖ్య‌మంత్రికి స‌వాళ్లు..హెచ్చిర‌క‌లు చేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ తాజా ట్వీట్ల మీద వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+