లోకసభ ఎన్నికలు 2019 : న‌ర్స‌రావుపేట‌ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : History Of Narasaraopet Constituency,Sitting MP,MP Performance Report

    ప‌ల్నాటి బ్ర‌హ్మానాయుడు - నాగ‌మ్మ ల పోరాటాలు గుర్తు చేసే ప‌ల్నాడు ప్రాంతమైన న‌ర్స‌రావు పేట పార్ల‌మెంట్ లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌. రాజ‌కీయ పౌరుషాలు ఎక్కువే. ద‌శాబ్దాలుగా అంటి పెట్టుకున్న పార్టీల గెలుపే ల‌క్ష్యంగా ఇక్క‌డ మ‌ద్ద‌తు దారులు పార్టీల కార్య‌క‌ర్త‌ల కంటే ఎక్కువ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తారు.

    న‌ర్స‌రావు పేట‌లో 16 ల‌క్ష‌లు దాటిన ఓట‌ర్లు..

    న‌ర్స‌రావు పేట పార్ల‌మెంట్ ప‌రిధిలో ప్ర‌స్తుతం ఓట‌ర్ల సంఖ్య 16 ల‌క్ష‌లు దాటింది. కొత్త ఓట‌ర్లుగా యువ‌త భారీ సంఖ్య తో చేరుతోంది. 2014 ఎన్నిక‌ల ప్ర‌కారం ఇక్క‌డ ఓట‌ర్ల సంఖ్య 1,514,861. అందులో పురుష ఓట‌ర్లు.. 748,465 కాగా, మ‌హిళా ఓట‌ర్లు సంఖ్య .. 766,396 గా ఉంది. ఇక్క‌డ పోలింగ్ శాతం దాదాపు 80 శాతం వ‌ర‌కు ఉంటంది. 2014 ఎన్నిక‌ల్లో నర్స‌రావుపేట పార్ల‌మెంట్ ప‌రిధిలో ఓటింగ్ 85 శాతంగా న‌మోదైంది.

    ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల నుండే ఎంపీలు..

    1952 లో ప్రారంభ‌మైన న‌ర్స‌రావు పేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారే ఎంపీలుగా గెలుస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన 14 ఎన్నిక‌ల్లో రెడ్డి సామాజిక వ‌ర్గం నుండి ఏడు సార్లు, క‌మ్మ సామాజిక వ‌ర్గం నుండి నాలుగు సార్లు, వైశ్య సామాజిక వ‌ర్గం నుండి ముగ్గురు ఎంపీలుగా గెలిచారు.

    రాయ‌పాటి ని గెలిపించిన ప‌ల్నాడు ప్ర‌జ‌లు..

    గుంటూరు ఎంపీగా నాలుగు సార్లు పోటీ చేసి టిడిపిలో చేరిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావును ప‌ల్నాడు ప్ర‌జ‌లు 2014 లో ఎంపీగా గెలిపించారు. వైసిపి నుండి రాంకీ సంస్థ‌ల అధినేత అయోధ్య రామిరెడ్డి పోటీ చేసారు. రాయ‌పాటి కి - 632464 ఓట్లు రాగా..వైసిపి అభ్య‌ర్ధి, రాంకీ అయోధ్య రామిరెడ్డి కి 597134 ఓట్లు వ‌చ్చాయి. కాగా, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు 35,280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్ల‌మెంట్ ప‌రిధిలోని టిడిపి మెజార్టీ సాధించిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెద‌కూర పాడు -8857, చిల‌క‌లూరిపేట 8408, స‌త్తెన‌ప‌ల్లి-2314, వినుకొండ‌ -19582,గుర‌జాల -4499 కాగా, న‌ర్స‌రావు పేట పార్ల‌మెం ట్ ప‌రిధిలో వైసిపి మెజార్టీ సాధించిన నియోజ‌క‌వ‌ర్గాలు..న‌ర్స‌రావు పేట‌ - 5699, మాచ‌ర్ల - లో 2485 మెజార్టీ ద‌క్కింది. ఇక‌, ఈ సారి టిడిపి - వైసిపి రెండు పార్టీల నుండి అభ్య‌ర్ధులు మారే అవ‌కాశం ఉంది.

    #LokSabhaElection2019: All about narasaraopet Constituency

    స‌మీక‌ర‌ణాలు..వ‌ర్గాలే రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర‌..

    ప‌ల్నాడు ముఖ ద్వారం న‌ర్స‌రావు పేట పార్ల‌మెంట్ ప‌రిధిలో రాజ‌కీయాల‌ను శాసించేది..అక్క‌డి సామాజిక స‌మీక‌ర‌ణా లే. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ వ‌ర్గ పోరాటాలు సాధ‌ర‌ణ‌మైన విష‌యం. ఇక‌, ఇక్క‌డ రెండు ప్ర‌ధాన వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు రెండు ప్ర‌ధాన పార్టీల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇక‌, ఈ సారి ఇదే పార్ల‌మెంట్ ప‌రిధిలో టిడిపి సిట్టింగ్ ల‌కే ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. వైసిపి నుండి గుంటూరు కు చెందిన లావు కృష్ణ దేవ‌రాయులును స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ప్ర‌క‌టించారు.

    సీనియ‌రే..అయినా స‌భలో మాత్రం..

    న‌ర్స‌రావు పేట ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న రాజ‌కీయాల్లో అంత‌గా యాక్గివ్ గా ఉండ‌టం లేదు. 2014 లో న‌ర్స‌రావు పేట ఎంపీగా గెలిచిన‌ప్ప‌టి నుండి స‌భ‌లో కేవ‌లం 5 చ‌ర్చ‌ల్లో మాత్ర‌మే పాల్గొన్నారు. ఒక్క బిల్లును సైతం ఆయ‌న ప్ర‌వేశ పెట్ట‌లేదు. సిట్టింగ్ స‌భ‌లో రాయ‌పాటి 350 ప్ర‌శ్న‌లు సంధించారు. ఇక‌, స‌భ‌కు హాజ‌రు శాతం కూడా త‌క్కువ‌గానే ఉంది. కేవ‌లం 39 శాతం మాత్రమే ఆయ‌న హాజ‌రు శాతం రికార్డు స‌భలో రికార్డు అయింది.

    ఈ సారి హోరా హోరీ పోరే..

    న‌ర్స‌రావు పేట పార్ల‌మెంట్ లో ఈ సారి అభ్య‌ర్ధులు ఎవ‌ర‌నే దాని పై ప్ర‌ధాన పార్టీల నుండి ప‌లువురు ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుత ఎంపి రాయ‌పాటి పోటీ పై భిన్న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. దీంతో..వైశ్య సామాజిక వ‌ర్గాని కి టిడిపి అవ‌కాశం ఇస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసిపి నుండి ప్ర‌స్తుత స‌మ‌న్వ‌య‌క‌ర్త అభ్య‌ర్ధి గా పోటీలో ఉంటా ర‌ని భావిస్తున్నారు. ఇక‌, గ్రామీణ ప్రాంతం..రైతులు..వ్యాపారులు ఎక్కువ‌గా ఉండే ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో రెండు పార్టీ ల మ‌ధ్య హోరా హోరీ పోరు త‌ప్పేలా లేదు. ఇక‌, జ‌న‌సేన అభిమానుల శాతం ఇక్క‌డ ఎక్కువ‌గా నే ఉంది. ఎన్నిక‌ల్లో వీరి ఓటింగ్ తీరు ఫ‌లితాల పై ప్ర‌భావం చూప‌నుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+