Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకసభ ఎన్నికలు 2019 : రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : History Of Rajampet Constituency, Sitting MP, MP Performance Report

    ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి. వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది.ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అటు చిత్తూరు జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. అవి రాజంపేట, కోడూరు, రాయచోటి సెగ్మెంట్లు కడప జిల్లాలో ఉండగా... తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.

    తొలిలోక్‌సభ ఎన్నికలు అంటే 1952లో జరిగిన సమయంలో రాజంపేట ఇంకా పార్లమెంటు స్థానంగా ఆవిర్భవించలేదు. రెండో లోక్‌సభ ఎన్నికల్లో అంటే 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఎన్ విశ్వనాధ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇ క ఈ నియోజకవర్గం నుంచి మూడవ లోక్‌సభకు స్వతంత్ర పార్టీకి చెందిన సీఎల్ నర్సింహారెడ్డి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి వరసగా నాలుగుసార్లు పోతురాజు పార్థసారథి గెలిచారు. ఇక 1984లో తెలుగుదేశం అభ్యర్థి పాలకొడ్రాయుడు సుగవాసి గెలవగా ఆ తర్వాత సాయిప్రతాప్ రెడ్డి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు.

    ఇక 1999లో టీడీపీ నుంచి ఎంపీగా గుణిపాటి రామయ్య గెలిచారు. ఇక 14, 15వ లోక్‌సభలో మళ్లీ సాయిప్రతాప్ గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేసి రాజంపేట ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. అయితే ప్రత్యేక హోదా కోసం ఆయన తన పదవికి 2018 జూన్‌లో రాజీనామా చేయడం జరిగింది. మొత్తం 14,87,791 మంది ఓటర్లు రాజంపేట పార్లమెంట్‌లో ఉన్నారు. 2014 ఎన్నికల్లో మిథున్ రెడ్డి తన సమీప బీజేపీ ప్రత్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరిపై 1,74,762 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

    #LokSabhaElection2019: All about RAJAMPET Constituency

    ఇక సామాజిక విషయానికొస్తే రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీని నిర్ణయించేది బలిజ సామాజికవర్గానికి చెందిన ఓట్లరు. రాజంపేట పార్లమెంటు స్థానం కింద వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు అసెంబ్లీ సెంగ్మెంట్లలో అత్యధికంగా ఉన్న ఓటర్లు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. అందుకే బలిజ సామాజిక వర్గంవారు ఎవరి వైపు నిలిస్తే వారే ఆ నియోజకవర్గం ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. ఒక రెండు సార్లు తప్పితే.. ఇక 1967 నుంచి 1980 వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన పి. పార్థసారథి అక్కడ ఎంపీగా గెలిచారు.

    1984లో అదే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎస్.పాలకొండరాయుడు టీడీపీ నుంచి ఎంపీగా గెలువగా... 1989 నుంచి 1998 వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎ.సాయిప్రతాప్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. మరోవైపు రాజంపేట రాయచోటిలలో ముస్లిం సామాజిక వర్గం ఓటర్లు కూడా అభ్యర్థి గెలుపును శాసించే సత్తా ఉంది. ఇక రెడ్డి సామాజిక వర్గం, దళితులు, గిరిజనులు బలిజ, ముస్లిం సామాజిక వర్గాలతో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పొచ్చు.

    2014లో కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ గాలి వీయడంతో మిథున్ రెడ్డి లక్ష పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతేకాదు ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది. అది కాకుండా 2014లో టీడీపీ బీజేపీలు పొత్తులో ఉన్నందున రాజంపేట పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె స్థానికురాలు కాకపోవడంతో ఆమెను ఓటర్లు తిరస్కరించారు.

    ఎన్టీఆర్ కుమార్తెగా పేరు ఉన్నప్పటికీ స్థానిక అంశం దృష్ట్యా రాజంపేట ఓటర్లు ఆమెను దూరం పెట్టినట్లు అక్కడి స్థానికులు చెబుతారు. 2019లో పోరు ఆసక్తికరంగా మారనుంది. ప్రత్యేక హోదా కోసం రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి మళ్లీ ఈ సారి మిథున్ రెడ్డికే టికెట్ ఇస్తారా లేక జగన్ మదిలో ఇంకెవరైనా ఉన్నారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక టీడీపీ కాంగ్రెస్ పార్టీలు పొత్తులో పోటీచేసే అవకాశం ఉన్నందున ఆ స్థానం కాంగ్రెస్‌కే దక్కేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మళ్లీ బలిజ సామాజిక వర్గానికి చెందిన సాయిప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఇటు టీడీపీ ఇటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో వైసీపీకి గట్టి పోటీ తప్పదనే వాదన వినిపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+