సీఎం జగన్ కు మద్దతుగా నిలిచిన లోక్‌సత్తా జేపీ..!!

ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ తాజాగా సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రశంసించటం ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కార్యాచరణలో భాగంగా నాలుగు కార్యాక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్రకటించారు. అందులో భాగమైన జగనన్న ఆరోగ్య సురక్ష ను డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు.

సీఎం నిర్ణయానికి ప్రశంసలు:ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. చికిత్స అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అవసరమైతే వారికి తోడ్పాటు ఇస్తున్నారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు హెల్త్‌ స్క్రీనింగ్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తాజాగా పార్టీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. ఆరోగ్య సమస్యలు రాకుండా.. లక్షణాలు కనిపించినా వారికి ఆరోగ్య పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Loksatta Jayaprakash Narayana priases CM Jagan Decision Arogya Suraksha, video goes viral

ఆరోగ్య సురక్ష మేలు చేస్తుంది:ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం దేశానికే ఆదర్శమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయమని డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ కొనియాడారు. బేస్‌లైన్‌ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్‌ స్క్రీనింగ్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు అనారోగ్య సమస్య తలెత్తినా పూర్తి స్థాయి వైద్యానికి వీలుగా ఈ డిజిటల్ ప్రక్రియ తోడ్పాటు అందిస్తుంది. ప్రతీ సచివాలయ పరిధిలోనూ ఈ సేవలు అందిస్తున్నారు.

Loksatta Jayaprakash Narayana priases CM Jagan Decision Arogya Suraksha, video goes viral

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా:ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తున్న సేవలను జేపీ ప్రశంసించారు. ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుండటాన్ని అభినందించారు. ఆస్పత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పారు.

ప్రస్తుతం జీవనశైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని అభిప్రాయ పడ్డారు. ఇలాంటి తరుణంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జేపీ వివరించారు. ఈ మేరకు జేపీ ఆరోగ్య సురక్షను ప్రశంసించారు. వచ్చే రెండు నెలల పాటుగా ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+