గుండు ఫోటోతో..: గంగిరెడ్డికి ఉచ్చు, లుకౌట్ నోటీసులు

దీంతో ఆతన్ని స్వదేశానికి రప్పించేందుకు కర్నూలు పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఇమిగ్రేషన్ కేంద్రాల్లో గంగిరెడ్డిపై లుకౌట్ నోటీసు జారీ అయింది. కడప పోలీసులు కూడా నోటీసు జారీకీ సిద్ధమవుతున్నారు. కడప జిల్లాలో తాజాగా మూడు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులలో గంగిరెడ్డిని నిందితునిగా చేర్చారు. ఇటీవల రైల్వే కోడూరులో పట్టుబడిన అతని ముఖ్యమ అనుచరుడు సిద్ధయ్య ఇచ్చిన సమాచారంతో కొత్తగా కేసులు నమోదు చేశారు.
పీడీ కేసు నమోదుకు సిద్ధం చేస్తున్నారు. గంగిరెడ్డి వివిధ సందర్భాలలో తన పుట్టిన తేదీ, సంవత్సరాలను వేర్వేరుగా పేర్కొన్నట్లు పోలీసులు తేల్చారు.
2003లో పాసుపోర్టు పొందినప్పుడు, రెన్యువల్ సమయంలో.. తన పాత పాసుపోర్టు పోయిందని చెప్పి తత్కాల్ కింద గత ఏడాది జూన్ 26న కొత్త పాసుపోర్టు పొందాడు. గుండుతో ఉన్న ఫోటోతో పొందిన ఈ పాసుపోర్టుతోనే గంగిరెడ్డి గత నెలలో విదేశాలకు పరారయ్యాడు. గంగిరెడ్డి పైన అలిపిరిలో చంద్రబాబపై దాడి ఘటన కేసుతో పాటు పది క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. వీటిలో చాలా వరకు హత్య కేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications