కబ్జాకోరల్లో రాములోరి భూమి.. 9 వందల ఎకరాలు అన్యాక్రాంతం..
చెరువులను కొందరు ఆక్రమించారు. మరికొందరు దేవుని భూములను కూడా వదలడం లేదు. అవును భద్రాద్రి రాములోరి వందల ఎకరాల మాన్యం అన్యాక్రాంతం అవుతోంది. దేవుడి భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. 9 వందల ఎకరాల దేవుడి మాన్యం కనుమరుగు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. భద్రాచలానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం ఏపీలో కలిసింది. ఇక్కడ రాములోరికి 900 ఎకరాల భూములు ఉన్నాయి.

ఇదీ సమస్య
రాష్ట్ర విభజన సమయంలో రాములోరి భూమి ఏపీ భూభాగంలోకి వెళ్లిపోగా.. తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు. భద్రాచలం రామాలయం తెలంగాణలో ఉండటంతో ఏపీ అధికారులు, పోలీసులు ఈ భూమి వైపు చూడలేదు. ఇదీ అక్రమార్కులకు వరంగా మారింది. వారు మెల్లిగా పదుల ఎకరాలు ఆక్రమించుకున్నారు. భద్రాచలం ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తెలుసుకున్న శ్రీరామ్‌నగర్, కొల్లుగూడెం గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకురాకపోగ.. వారు కూడా కొంత భూమిని ఆక్రమించేశారు.

50 ఎకరాల ఖాళీ స్థలం
రామాయణం థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి కేటాయించిన 50 ఎకరాల ఖాళీ ప్రదేశంలో వాళ్లే పంచేసుకున్నారు. రాములోరి భూమిలో గుడిసెలు కూడా వేసేశారు. విషయం బయటపడటంతో భద్రాచలం ఆలయ ఈవో స్పందించారు. భూములు అన్యాక్రాంతం అవడంపై పోలీసులతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆలయ భూముల్లో నిర్మాణాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మొత్తం 1350 ఎకరాల భూమి
భద్రాచలం ఆలయానికి, దేవుడి మాన్యం కింద మొత్తం 1350 ఎకరాల భూమి ఉంది. 917 ఎకరాలు భద్రాచలం పక్కనే ఉన్న పురుషోత్తపట్నంలో ఉంది. ఈ గ్రామం ఏపీలో కలవగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఇప్పుడు ఉంది. పురుషోత్తపట్నంలో ఉన్న 917 ఎకరాల్లో 15 ఎకరాల్లో కరకట్ట నిర్మాణం, ఇళ్లు కోల్పోయిన వారికోసం స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కొంత భూమిని తీసుకుంది. దేవాదాయశాఖకు కొంతమేర డబ్బులు ఇచ్చింది. 899 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. ఇలా రాములొరి భూమి ఆక్రమణకు గురవుతుంది. అధికారులు మాత్రం ఇప్పుడే తెలిసినట్టు నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications