లారీలో మంటలు: పేలిన 450 సిలిండర్లు(పిక్చర్స్)
కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి మండలం ఏనుగమర్రి దగ్గర జాతీయ రహదారిపై గురువారం గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధమయ్యింది. లారీలో మంటలు చెలరేగి 450 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అనంతపురం నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ నందికొట్కూరుకు బయలుదేరింది.
మార్గమధ్యంలో లారీ ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కుళ్లాయప్ప అప్రమత్తమై దిగి పరారయ్యారు. హైవే పక్కన ఉన్న ఏనుగమర్రి గ్రామస్తులకు సమాచారం చేరవేసి దూరం పంపించివేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
మూడు గంటలపాటు లారీలోని గ్యాస్ సిలిండర్లు దగ్ధమయ్యాయి. సిలిండర్ల శకలాలు రెండు కిలోమీటర్ల మేర ఎగసిపడ్డాయి. పోలీసులు చేరుకొని ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. హైవేపై 4 గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. హైవేకు సమీపాన ఉన్న నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యాయి.

స్తంభించిన ట్రాఫిక్
జిల్లాలోని ప్యాపిలి మండలం ఏనుగమర్రి దగ్గర జాతీయ రహదారిపై గురువారం గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధమయ్యింది.

ముక్కలైన సిలిండర్
లారీలో మంటలు చెలరేగి 450 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.

మంటలార్పుతూ..
అనంతపురం నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ నందికొట్కూరుకు బయలుదేరింది.

లారీ దగ్ధం
మార్గమధ్యంలో లారీ ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కుళ్లాయప్ప అప్రమత్తమై దిగి పరారయ్యారు.

రహదారిపై చెల్లాచెదురుగా..
హైవే పక్కన ఉన్న ఏనుగమర్రి గ్రామస్తులకు సమాచారం చేరవేసి దూరం పంపించివేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

రహదారి పక్కకు కొన్ని..
మూడు గంటలపాటు లారీలోని గ్యాస్ సిలిండర్లు దగ్ధమయ్యాయి. సిలిండర్ల శకలాలు రెండు కిలోమీటర్ల మేర ఎగసిపడ్డాయి.

సిలిండర్లు
పోలీసులు చేరుకొని ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. హైవేపై 4 గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. హైవేకు సమీపాన ఉన్న నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యాయి.












Click it and Unblock the Notifications