మద్యం దుకాణాలు దక్కేది వీరికే - బ్రాండెడ్ ధరల పై తాజా నిర్ణయం..!!
ఏపీలో మద్యం దుకాణాలు నేడు ఖరారు కానున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో భాగంగా 3,396 మద్యం షాపుల కోసం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా
దరఖాస్తు ఫీజుల ఆదాయం 1,798 కోట్లు సమకూరింది. సగటున ఒక్కో దుకాణానికి 26 మంది పోటీ పడ్డారు. ఈ నెల 16 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో లిక్కర్ ధరలను మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
లాటరీ తో ఖరారు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న మద్యం దుకాణాలకు నేడు టెండర్లు ఓపెన్ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో షాపులు కేటాయిస్తారు. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షల చొప్పున... 89,882 అప్లికేషన్లకు రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి మద్యం దుకాణాలకు
ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాపునకు సగటున 52 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పోటీ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో ఒక షాప్ కోసం 132, మరో షాప్ కోసం 120దరఖాస్తులు అందాయి.
కూటమి నేతల జోక్యం పైనా ఫిర్యాదులు వచ్చాయి. సీఎం చెప్పినా సీఎం హెచ్చరించినా తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో రాజకీయ జోక్యం ఆగలేదు.

16 నుంచి కొత్త దుకాణాలు
రాష్ట్ర వ్యాప్తంగా నేడు కలెక్టర్ల సమక్షంలో ప్రతి దుకాణానికి వేర్వేరుగా లాటరీ తీసి, ఎంపికైన వారికి లైసెన్స్ పత్రాలు అందజేస్తారు. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. ఒక్క దరఖాస్తుల రూపంలోనే రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. సోమవారం లాటరీలో షాప్ దక్కించుకున్న 24గంటల్లోపు మొదటి విడత లైసెన్స్ రుసుము చెల్లించాలి. దీని ద్వారా మరో రూ 300 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా రానున్నాయి. దీంతో నూతన పాలసీ ప్రారంభ దశలోనే ప్రభుత్వానికి రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
మద్యం ధరల్లో మార్పు
షాపులు దక్కించుకున్న వారు ఈ నెల 16 నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సవరణ చేసింది. బాటిల్ ఎమ్మార్పీ ధర 150.50గా ఉంటే దాన్ని 160 రూపాయలకి ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు కానుంది. ఇక..గతంలో ఉన్న విధంగానే బ్రాండెడ్ మద్యం పూర్తి స్థాయిలో అన్ని దుకాణాల్లో అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications