ప్రేమ: టెక్కీ హత్య, ప్రియురాలి సోదరుడికి తెలియకుండా

 Love: Techie found dead in Hyderabad
హైదరాబాద్: ప్రేమ వ్యవహారంలో ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాదులో ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం మేరకు... కుమార్ మిశ్రా అనే 21 ఏళ్ల యువకుడు హైటెక్ సిటీలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

అదే సాఫ్టువేర్ కంపెనీలో పని చేసే ఓ యువతితో అఏతనికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో యువకుడు ఇటీవల అదృశ్యమయ్యాడు. ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో నెల పది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.

సదరు యువతి సోదరుడు సూచన మేరకు అతని మిత్రులు యువకుడిని బలవంతంగా తీసుకు వెళ్లారు. అతని పైన పెట్రోల్ పోసి కాల్చారు. అయితే ఈ విషయాన్ని యువతి సోదరుడికి అతని మిత్రులు చెప్పలేదు. స్నేహితులు కూడా అతనికి తెలియనివ్వలేదని సమాచారం.

అదృశ్యమైన యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి సోదరుడి పైన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు యువతి సోదరుడిని ప్రశ్నించారు. మిత్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+