టీవీ నటి ప్రేమ కథ సుఖాంతం, కౌన్సెలింగ్‌తో పెళ్లికి ప్రియుడు ఓకే
హైదరాబాద్: ప్రియుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రముఖ టీవీ నటి రూపా హుస్సేన సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె కథ సుఖాంతమైంది. పోలీసులు ఇరు వైపుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.
రూపను కాపాడిన లేక్ వ్యూ పోలీసులు, ఎస్సై శ్రీదేవి రూప సొదరుడని, ఆమె ప్రియుడు కేవల్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించాయి.

కాగా, రూప అసలు పేరు హరిజిత్ కౌర్. రూప, ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్న తన బంధువు కేవల్ సింగ్ ప్రేమించుకున్నారు. ఇరువురు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, పెళ్లి విషయానికి వచ్చేసరికి కేవల్ సింగ్ నో చెప్పాడు.
ఆమె సీరియల్స్‌లో నటించకూడదంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లి మాట ఎత్తేసరికి, టీవీ నటిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబం ఒప్పుకోవడం లేదంటూ చేతులెత్తేశాడు. అతనిని ఒప్పించలేక విసిగిపోయిన రూప చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను పోలీసులు రక్షించారు. అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications