వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని చూపించి, ప్రేమించానని...: ప్రియుడి దారుణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lover cheats girl in Hyderabad, absconds
హైదరాబాద్: యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ఈ సంఘటన హైదరాబాదు సమీపంలోని మేడిపల్లిలో జరిగింది. ప్రేమ పేరుతో వంచించిన అతని వల్ల ఆమె గర్భం ధరించింది. తనను పెళ్లి చేసుకుంటానని తన ప్రియుడు మోసం చేశాడని బాధితురాలు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అడగటంతో అతను పరారయ్యాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి వయస్సు 19 ఏళ్లు. ఆమె కూలీ పని చేస్తోంది. ఆమె గ్రామం ఘట్ కేసర్ మండలంలో ఉంది.

నిందితుడు 22 ఏళ్ల శివ బోడుప్పల్‌లో నివసిస్తున్నాడు. ఇతని సొంత జిల్లా ఒంగోలు. రెండేళ్ల క్రితం అతను హైదరాబాదుకు వచ్చాడు. అతను కన్‌స్ట్రక్షన్ సైట్లలో పని చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ ఆపార్టుమెంట్‌లో పని చేస్తున్నప్పుడు ఓ సెక్యూరిటీ గార్డు అతనికి పరిచయమయ్యాడు. ఈ సెక్యూరిటీ గార్డు బాధితురాలి తండ్రి.

తన కూతురుకు ఏదైనా ఉద్యోగం ఉంటే చూడాలని శివను ఆ తండ్రి కోరాడు. తాను ఏదో ఒక ఉద్యోగంలో ఆమెను పెడతానని శివ అతనితో చెప్పాడు. అనంతరం ఓ ఆమెకు ఓ పని చూయించాడు. పని వద్ద తరుచూ ఆ యువతితో మాట్లాడుతుండేవాడు. వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఆమెతో పిజికల్ రిలేషన్ షిప్ కూడా కొనసాగించాడు.

కొద్ది రోజులకు ఆమె ప్రెగ్నెంట్ అయింది. దీంతో, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె శివను అడిగింది. తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించరని, అందుకే తాను చేసుకోలేనని అతను సమాధానం చెప్పాడు. ఆమె పలుమార్లు అతనిని పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే, అతను మాత్రం తప్పించుకుపోయాడు.

దీంతో, ఏం చేయలేక బాధిత బాలిక, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని పైన సెక్షన్ 420, 406 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది.

English summary

 A teenager was allegedly cheated and impregnated by her lover at Medipally. Police said the accused befriended the victim, promised to marry, and sexually exploited her. The victim who is six months pregnant asked him to marry her, but he refused and absconded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X