ప్రేమించి మోసం చేసిందని వీరంగం, బస్సులో అసభ్యంగా

పెళ్లి వేళ యువతి తనను మోసగించిందని ఆరోపించారు. గురువారం తాండూరు ఐబి వచ్చిన అరుణ్ కుమార్ కూడలి వద్ద తిర్యాణి వెళ్తున్న యువతిని అడ్డగించి ప్రశ్నించారు. ఆమె లెక్క చేయకుండా వెళ్లడంతో చేసేది లేక రోడ్డు పైన వాహనాలను అడ్డగించి లారీ కింద ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తాండూరు అదనపు ఎస్సై రాజేంద్ర కుమార్ వచ్చి అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను, తిర్యాణికి చెందిన యువతి ప్రేమించుకున్నామని, రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్తానని చెప్పిన యువతి.. మరో యువకుడిని పెళ్లి చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారట. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు
ఓ యువతితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. చెన్నై నుండి హైదరాబాదు వస్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రాంప్రసాద్ అనే యువకుడు తోటి ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications