అవును వారిద్దరూ భార్య భర్తలే,కాని విడిగా ఉంటున్నారు. మరో సారి పెళ్ళిచేసుకోవాలనుకొన్నారు

ప్రేమించుకొన్నారు రహస్యంగా పెళ్ళి చేసుకొన్నారు. పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే గుంటూరుకుచెందిన మణికంఠ, శోభితలు. శోబిత తల్లిదండ్రులు మరోక యువకుడితో వివాహనికి సిద్దం కా

గుంటూరు:ప్రేమించుకొన్నారు రహస్యంగా పెళ్ళిచేసుకొన్నారు. పెద్దల అంగీకారంతోపే అందరి సమక్షంలో మరోసారి వివాహం చేసుకోవాలని భావించారు. అయితే యువతి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహనికి సిద్దం కావడంతో ఈ ప్రేమికుల జంట పోలీసులను ఆశ్రయించింది. తమ కుటుంబాల నుండి రక్షణ కల్పించాలని కోరారు.గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది.

గుంటూరు జిల్లా తెనాలి నాజర్ పేటకు చెందిన ఇద్దరు ప్రేమికులు తమకు తల్లిదండ్రుల నుండి రక్షణ కల్పించాలని ఎస్ పి ని కోరారు. నాజర్ పేటకు చెందిన అల్లం మణికంఠ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడు ఆమె స్కూల్ మేట్ జన్ను శోభితను ప్రేమిస్తున్నాడు. శోభిత ఎంటెక్ పూర్తిచేసింది.ఆరేళ్ళుగా వారిద్దరూ ప్రేమించుకొంటున్నారు.

lovers approach police for protection

వీరిద్దరి ప్రేమాయణం శోభిత ఇంట్లో తెలిసింది. మణికంఠను బెదిరించారు. తమ అమ్మాయి జోలికి రావద్దని హెచ్చరించారు..హైద్రాబాద్ లోని ఆర్యసమాజ్ లో ప్రేమికులు వివాహం చేసుకొన్నారు. 2016 ఏప్రిల్ రెండవ తేదిన ప్రేమికులు ఆర్యసమాజ్ లో వివాహం చేసుకొన్నారు. అయితే పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

తమకు వివాహం అయిన విషయాన్ని ఇద్దరు తమ ఇళ్ళలో చెప్పలేదు. అయితే శోభితకు మరో యువకుడితో వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆమె వెంటనే మణికంఠకు సమాచారం చేరవేసింది. ఈ సమాచారం అందుకొన్న మణికంఠ బెంగుళూరు నుండి గుంటూరుకు చేరుకొన్నాడు. ఇద్దరు సోమవారం నాడు గుంగూరు రూరల్ ఎస్ పి ని కలిశారు. తమకు వివాహమైన విషయాన్ని ఆధారాలను పోలీసులకు చూపారు.తమ కుటుంబసభ్యుల నుండి రక్షణ కావాలని కోరారు. పోలీసులు రెండు కుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+