ప్రేమ: యువతితో కలిసి వివాహితుడి ఆత్మహత్య

నల్లగొండ: తాను ప్రేమించిన యువతితో కలిసి ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులో సోమవారం చోటు చేసుకుంది. మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన గునగండ్ల వీరస్వామి (30), కొంత కాలంగా మేళ్లచెర్వులోని కీర్తి సిమెంట్ పరిశ్రమలోని లోడింగ్ విభాగంలో కార్మికుడిగా పనిచేస్తన్నాడు.

కుటుంబతో కలసి అక్కడే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పరిశ్రమ ఎదుట మౌనిక (18) తినుబండారాల దుకాణం నడుపుతోంది. కొన్నాళ్లుగా వీరస్వామి ఆ దుకాణానికి వెళ్తూ మౌనికతో చనువు పెంచుకున్నాడు.

Lovers commit suicide in Nalgond1a

ఆ చనువుతో మౌనిక అతనితో ప్రేమలో పడింది. వారి ప్రేమాయణం సాగుతుండగా అనూహ్యంగా ఆదివారం రార్తి మౌనిక 8 గంటలకే దుకాణం మూసేసి వెళ్లింది. సోమవారం తెల్లారేసరికి అతడితో నిర్జీవంగా చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

Lovers commit suicide in Nalgonda2

తమ మరణానికి ఎవరూ కారణం కాదని వారిద్దరు ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టారు. సూసైడ్ నోట్ సంఘటనా స్థలంలో పోలీసులకు లభించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+