బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- ఏపీలో భారీ వర్షాలు

Bay of Bengal: బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో కొద్దిరోజుల కిందట ఏర్పడిన ఈ ఆవర్తనం తాజాగా అల్పపీడనంగా మారింది. సముద్రతలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు- మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. క్రమంగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం, పుదుచ్చేరి, శ్రీలంక వైపు కదులుతోంది

Low-pressure area has formed in the Bay of Bengal heavy rains to Andhra Pradesh

దీని ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 15, 16 తేదీల వరకు యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావొచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది.

నేడు నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.

బుధవారం నాడు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం కృష్ణా, గంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ అల్పపీడన ప్రభావం అటు తమిళనాడుపైనా తీవ్రంగా ఉండబోతోంది. చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, కాళ్లకురిచ్చి, తూత్తుకూడి, దిండిగల్, మధురై, విరుధ్‌నగర్, థేని, తెన్ కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+