బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర రూపం దాల్చుతోంది. ఇది సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు కదలనుంది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలుుఉన్నాయి. ప్రత్యేకించి కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతోంది. నేడు వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, అనంతరం మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా బలపడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్‌టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తోన్నామని అన్నారు.

Low pressure area over the Southeast Bay of Bengal has intensified to develop into a Cyclonic Storm

బంగాళాఖాతంలో బలపడుతున్న ఈ తుఫాన్ బుధవారం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చుతుందని, తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ వ్యవస్థ వాయవ్య దిశగా పయనిస్తూ కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

కార్తీకమాసంలో తులసి పూజ విశిష్టత
కార్తీకమాసంలో తులసి పూజ విశిష్టత

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని ఎస్డీఎంఏ పేర్కొంది. ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు.. జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు.

తిరుమల రూ. 300 దర్శనం, వసతి గదుల బుకింగ్ వివరాలు
తిరుమల రూ. 300 దర్శనం, వసతి గదుల బుకింగ్ వివరాలు

అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడొచ్చు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతంలో అలల ఉధృతి ప్రమాదకరంగా ఉంటోంది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో నేటి నుంచి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+