అల్పపీడనం ఎఫెక్ట్: ఏపీలో మరికొద్ది రోజులపాటు వర్షాలు, ఈ జిల్లాల్లో అలర్ట్

అమరావతి: శీతాకాలం ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, మరో రెండు మూడు రోజులపాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 4 లేదా 5వ తేదీల్లో అండమాన్ సముద్రం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది పశ్చిమ వాయువ్యంగా పయనించి.. బలపడే అవకాశాలున్నాయని చెప్పారు.

ఈ క్రమంలో దక్షిణ కోస్తాలో డిసెంబర్ 6,7 తేదీల్లో వర్షాలు పడే అవకాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తూర్పు/ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయి.

 low pressure effect: few days rains in andhra pradesh districts

ఉత్తర కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. శుక్రవారం మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో బుధవారం పొడి వాతావరణంగా ఉండగా, గురువారం మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శుక్రవారం కూడా మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ ప్రాంతంలో బుధవారం పొడి వాతావరణమే ఉంటుంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+