వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వణికిస్తున్న తుపాను ముప్పు - నెల్లూరును వదలని వరద : జాతీయ రహదారిపై ఇక్కట్లు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కొద్ది రోజుల క్రితం రాయలసీమను భారీ వర్షాలు..వరదలు అతలాకుతలం చేసాయి. భారీ నష్టం మిగిల్చాయి. ఇప్పటికీ నెల్లూరు జిల్లాను వరద వీడటం లేదు. ఇప్పుడు, తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్‌లాండ్‌ వద్ద అండమాన్‌ సమీపంలో మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం సాయంత్రం నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది డిసెంబర్‌ 2వ తేదీకి వాయుగుండంగా, 3వ తేదీకి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తరాంధ్ర.. ఒడిశా తీరం వైపు

ఉత్తరాంధ్ర.. ఒడిశా తీరం వైపు

తుపానుగా బలపడితే దీనికి జవాద్‌ అని పేరు ఖరారు చేసారు. 4వ తేదీ నాటికి ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు వచ్చి బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం అత్యధికంగా ఏపీపైనే ఉంటుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 2వ తేదీ నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

గోదావరి జిల్లాలపైనా ప్రభావం

గోదావరి జిల్లాలపైనా ప్రభావం

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, ఈ ఐదు జిల్లాల రైతులు పంటలు కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి వచ్చేయాలని కోరారు. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోను ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నదిలో వరద ఉధృతి మళ్లీ పెరిగింది.

నెల్లూరు జిల్లాను వదలని వరద

నెల్లూరు జిల్లాను వదలని వరద

సంగం, నెల్లూరు బ్యారేజీల నుంచి 1,81,756 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయం నుంచి 12 క్రస్ట్‌ గేట్ల ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులను పెన్నా నదికి విడుదల చేస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. బేతాయిపల్లె చెరువు అలుగు పారుతుండటంతో గోపవరం-బేతాయిపల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు

జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి గూడూరు ఆదిశంకర కళాశాల వద్ద దెబ్బతినడంతో వాహనాలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ఉప్పొంగి కోల్‌కతా, చెన్నై రహదారిపై ప్రవహించింది. దీంతో ఎక్కడికక్కడ రోడ్డు దెబ్బతింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఒక కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే.. 4, 5 గంటల సమయం పడుతోంది. నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
కోస్తా జిల్లాల్లో అధికారుల అప్రమత్తం

కోస్తా జిల్లాల్లో అధికారుల అప్రమత్తం

ఇక, రాయలసీమలో ఊహించని విధంగా వచ్చిన వరదలతో భారీ నష్టం జరగటంతో..ఇప్పుడు ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలర్ట్ తో అప్రమత్తం అయింది. ముందుగానే జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలకు అనుగుణంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో..రానున్న మూడు రోజుల్లో ఏపీలో పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది.

English summary
Low Pressure Likely To Become Cyclone Jawad Over Bay Of Bengal by December 3, 'it may effect on north coastal districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X