దసరా వేళ తుఫాను ముప్పు, ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం- తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవిని తలపించే స్థాయి లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తాయని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దసరా పండుగ వేళ వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించక ముందే కోస్తాను వాయుగుండం/తుఫాను తాకనున్నది. వీటి ప్రభావంతో ఈ నెల 15 తరువాత కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. అది తరువాత నాలుగు రోజుల్లో వాయువ్య దిశగా పయనించే క్రమంలో బలపడి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో తూర్పు గాలులు బలంగా మారి కోస్తాంధ్ర, ఒడిశాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 15 తరువాత వర్షాలు ప్రారంభమై కొన్నిచోట్ల భారీగా కురిసే అవకాశం ఉందని.. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
కాగా, గురువారం రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక, తాజా మార్పులతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే దక్షిణ కోస్తా లోని కాకినాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, వైఎస్‌ఆర్ కడప జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
