సిటీలో లక్నో అమ్మాయి అనుమానాస్పద మృతి

ఉద్యోగం కోసం అంకిత హైదరాబాద్ వచ్చింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 2లో గల ఓ టెక్స్‌టైల్ దుకాణంలో ఆమె పని చేస్తూ ఉండేది. మూడు నెలల క్రితం ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. తన రూమ్మేట్ వచ్చేసరికి ఆమె గదిలో ఉరేసుకుని కనిపించింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గదిని తనిఖీ చేశారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అంకిత ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications