సీఎంతో చిరంజీవి సమావేశం - జగన్ కు మెగాస్టార్ అంటే ఇష్టం : నాగార్జున కీలక వ్యాఖ్యలు.!!
సుదీర్ఘ విరామం తరువాత సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం వర్సస్ టాలీవుడ్ అన్నట్లుగా సాగుతన్న పరోక్ష యుద్దానికి ముగింపు పలికేందుకే ఈ సమావేశం జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. చాలా రోజులుగా ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రితో సమావేశం కావాలని భావిస్తున్నారు. అయితే, సీఎంకు వారితో సమావేశం అయ్యేందుకు సమయం దొరకలేదు. ఈ సమయంలో టిక్కెట్ల వివాదం..ధియేటర్ల మూసివేత చోటు చేసుకున్నాయి.
చిరును లంచ్ మీట్ కు ఆహ్వానం
ఇక, ఇదే సమయంలో ఏపీలో టిక్కెట్ల ధరల తగ్గింపు పైన హీరో నాని ..మరి కొందరు వ్యాఖ్యలు చేయటం మంత్రులు సీరియస్ గా రియాక్ట్ కావటంతో వార్ పీక్ కు చేరింది. ఇక, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ వరుస ట్వీట్లతో ఈ ఎపిసోడ్ లో మరింత హీట్ పెంచారు. ఆయన నేరుగా మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆ తరువాత ట్వీట్లు కొనసాగించారు. ఇక, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన వారి పైన చేసిన వ్యాఖ్యలు..దానికి పరిశ్రమ నుంచి వచ్చిన స్పందనతో ఇక, ఈ వివాదం కొత్త టర్న్ తీసుకోవటం మొదలైంది.

జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం
ఈ సమయంలో సీఎం జగన్ అప్పటికే చిరంజీవి అప్పాయింట్ మెంట్ కోరి ఉండటంతో ఈ రోజున లంచ్ మీటింగ్ కు రావాలని ఆహ్వానించారు. దీంతో..హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చిరంజీవి..తాడేపల్లిలో సీఎం నివాసానికి వచ్చారు. ఆయనకు ఎదురెళ్లి సీఎం సాదర స్వాగతం పలికారు. తాను సినీ పరిశ్రమ బిడ్డగా..సీఎం ఆహ్వానం మేరకు వచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక, ఈ భేటీ ప్రారంభం అవుతున్న సమయంలోనే హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ కు చిరంజీవి అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
Recommended Video

సినీ సమస్యలకు పరిష్కారం కోసమే
సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఈ మీటింగ్ దోహదం చేస్తుందని వివరించారు. తాను ఈ సమావేశానికి వెళ్లాల్సి ఉన్నా..తన సినిమా విడుదల కారణంగా వెళ్లలేదని వివరించారు. టిక్కెట్ల ధరల ప్రభావం తన సినిమాకు ఉండదని మాత్రమే తాను చెప్పానన్నారు. చిరంజీవి ఇలా సమావేశానికి వెళ్లాలని భావిస్తున్నాని చెప్పగా.. సీఎంతో సమావేశానికి వెళ్లమని తాను కూడా సలహా ఇచ్చానని చెప్పారు. ఈ సమావేశం సినీ పరిశ్రమ సమస్యలపైనే జరుగుతుందని నాగార్జున చెప్పుకొచ్చారు. దీంతో..ఇంత కాలం రాష్ట్రంలో వేడి పుట్టించిన ఈ వ్యవహారం పైన ఎలాంటి పరిష్కారం ఈ సమావేశంలో వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications