Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగబాబుకు విష్ణు భారీ కౌంటర్- నాన్న పవన్ కు ఫోన్ చేసారు : దమ్ముంటే మాట్లాడు..నేనేంటే చూపిస్తా..!!

సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా సాగుతున్న 'మా' ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరి కొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్..విష్ణు నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నారు. ఇదే సమయంలో సవాళ్లు..ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక, ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా విష్ణు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన స్పందించిన విష్ణు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన పైన చేసిన విమర్శల పైన సీరియస్ అయ్యారు.

జీవితంలో క్షమించనంటూ వార్నింగ్

జీవితంలో క్షమించనంటూ వార్నింగ్

తన కుటుంబం జోలికి వస్తే సహించేది లేదని నాగబాబు, ప్రకాశ్ రాజ్ లను హెచ్చరించారు. ఎవరినీ క్షమించే ప్రసక్తి లేదన్నారు. తన ఫ్యామిలీపై ఎవరైనా కామెంట్లు చేస్తే జీవితంలో క్షమించనని హెచ్చరించారు. పవన్‌కల్యాణ్‌కి కోపం వస్తే వార్‌ వన్‌సైడ్‌ అవుతుందంటూ నాగబాబు చేసిన ఓ కామెంట్‌పై విష్ణు సెటైర్‌ వేశారు. డైలాగ్‌ చాలా బాగుందని.. తన తదుపరి చిత్రాల్లో వాడుకుంటానని అన్నారు. మెగా కుటుంబంతో తనకు ఉన్న పరిచయాలను విష్ణు వివరించారు.

మెగా హీరోలతో సత్సంబంధాలు

మెగా హీరోలతో సత్సంబంధాలు

బన్నీ, చరణ్‌ తనకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పారు. చరణ్‌-మనోజ్‌-మా అక్క క్లోజ్ ఫ్రెండ్స్‌‌ అన్నారు. వాళ్లు తరచూ కలుస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. బన్నీ-నేను ఎక్కువగా మెస్సేజ్‌లు చేసుకుంటామని వెల్లడించారు. శిరీష్‌ తన తమ్ముడని... తేజ్‌ అయితే తన చిన్న తమ్ముడని విష్ణు చెప్పారు. మెగా హీరోస్‌తో నాది ఇప్పటి అనుబంధం కాదన్నారు. వాళ్లందరూ తనకుకు సపోర్ట్‌ చేస్తున్నారని వెల్లడించారు. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వ్యక్తి పేరు పలకడానికి కూడా తనకిష్టం లేదని, ఆయన అసలు తెలుగువారు కాదని, తమ సమస్యలు తాము పరిష్కరించుకోగలమని స్పష్టం చేసారు.

నా ఫ్యామిలీపై మాట్లాడితే నేనేంటో చూపిస్తా

నా ఫ్యామిలీపై మాట్లాడితే నేనేంటో చూపిస్తా

ప్రచారంలో భాగంగా నా ఫ్యామిలీపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని.. ఇక్కడివాడు కాదు కాబట్టి అతడికి నా ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు.. అందుకే, క్షమించి వదిలేశాను విష్ణు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఛాలెంజ్‌ చేస్తున్నా.. దమ్ముంటే అతడిని నా ఫ్యామిలీపై కామెంట్స్‌ చేయమనండి.. నేనేంటో చూపిస్తా' అని విష్ణు పరోక్షంగా ప్రకాశ్ రాజ్ కు సవాల్‌ విసిరారు. పవన్ కళ్యాణ్ తరచూ మోహన్ బాబు పేరు ప్రస్తావించటం గురించి తనను అనేక మంది ప్రశ్నించారని చెప్పారు.

పవన్ కళ్యాణ్ కు మోహన్ బాబు ఫోన్ చేసారు

పవన్ కళ్యాణ్ కు మోహన్ బాబు ఫోన్ చేసారు

అయితే, పవన్ కళ్యాన్..తన తండ్రి మధ్య ఎలాంటి ఈగో సమస్యలు లేవన్నారు. వకీల్ సాబ్ సినిమా తనతో పాటుగా మోహన్ బాబుకు నచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా చూసిన వెంటనే తన తండ్రి పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి సినిమా బాగుందని..వకీల్ సాబ్ గా బాగా యాక్టివ్ చేసావంటూ ప్రశంసించారని విష్ణు చెప్పారు. దీనికి పవన్ సైతం సానుకూలంగా స్పందించారని... మీ లాంటి పెద్ద నటులు అభినందించటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారంటూ విష్ణు వివరించారు. తాజాగా ఈ మధ్య కాలంలో రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ వేసిన ప్రశ్నలకు త్వరలోనే మోహన్ బాబు సమాధానాలు చెబుతారని స్పష్టం చేసారు.

ఫ్యామిలీ నుంచి పూర్తి మద్దతు ఉందంటూ

ఫ్యామిలీ నుంచి పూర్తి మద్దతు ఉందంటూ

తనకు ఫ్యామిలీ మద్దతు లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని.. అందులో నిజం లేదన్నారు. వాళ్లకు ఉన్న పరిచయాల మేరకు వాళ్లు చేస్తున్నారన్నారు. ప్రత్యర్థి ప్యానల్‌ వాళ్లు నాపై ఎన్ని విమర్శలైనా చేసుకున్న ఇబ్బంది లేదని..శ్రుతిమించి నా ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తే వాళ్లని జీవితంలో క్షమించనంటూ విష్ణు హెచ్చరించారు. ఇక, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు పోలింగ్ సాగనుంది. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. రాత్రికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+