‘మా’ ఎన్నికల్లో రోజా మద్దతు ఎవరికో చెప్పేసారు : ప్రకాశ్ రాజ్ పై కోట సీరియస్ కామెంట్స్..!!
సాధారణ ఎన్నికలను తలపించే తరహాలో సాగుతున్న 'మా' ఎన్నికలకు కేవలం రెండు రోజులే సమయం ఉంది. దీంతో..పోటీ పడుతున్న రెండు ప్రధాన ప్యానెళ్లు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం అయ్యాయి. ఇద్దరు తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో సినీ కమ్ పొలిటికల్ లీడర్లు తమ ఓటు ఎవరికి అనే దాని పైన సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన మనసులోని మాట చెప్పేసారు.
రోజా తన ఓటు గురించి ఏమన్నారు
ఇప్పటికే ప్రముఖ హీరోలు బాలకృష్ణ ..కృష్ణ, కృష్ణంరాజు లాంటి వారు విష్ణుకు మద్దతు ఇస్తున్నారు. ఈ సారి పోలింగ్ శాతంతో పాటుగా ప్రముఖలు అందరూ ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనే చర్చ సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల పైన మాట్లాడిన రోజా.. తన మనసులోని అభిప్రాయం స్పష్టం చేసారు.'మా' ఎన్నికల్లో తాను ఖచ్చితంగా ఓటు వేస్తానని రోజా చెప్పారు. అదే విధంగా.. మా' అసోసియేషన్ ను అభివృద్ధి చేయడానికి ఎవరు ఏం చేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు.

ఆ ప్యానల్ కే ఓటు వేస్తానంటూ..
దాంట్లో 'మా' ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికే ఓటు వేస్తాను" అంటూ తేల్చి చెప్పారు. 'మా' ఎన్నికలు మా రాజకీయ ఎన్నికలకన్నా వాడిగా వేడిగా సాగుతున్నాయన్నారు. అందులో తాను వేలు పెట్టదలచుకోలేదని చెప్పారు. కానీ ఒక ఆర్టిస్ట్ గా తన ఓటును మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. 'మా'ను ఎవరైతే అభివృద్ధి చేస్తారని నమ్ముతానో ఆ ప్యానల్ కే ఓటు వేస్తానని రోజా స్పష్టం చేసారు. ఇదే సమయంలో సీనియర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాస రావు సైతం 'మా' ఎన్నికల పైన స్పందించారు.

తేల్చి చెప్పేసిన కోట శ్రీనివాస రావు
తాను మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తాను. 'మా' అధ్యక్షుడిగా నిలబడడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. తాను నేషనల్ లెవెల్ నటుడినని చెబుతూ..తనకు నంది వంటి అవార్డులు వచ్చాయి అని తాను చెప్పుకోనన్నారు. కానీ ప్రకాష్ రాజ్ గురించి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నానని చెప్పారు. ప్రకాష్ రాజ్ తో తాను 15 సినిమాలు చేశానన్నారు. అన్నీ మెయిన్ రోల్సే అంటూ చెప్పుకొచ్చారు. అతను ఎప్పుడూ టైంకి షూటింగ్ కి రారని పేర్కొన్నారు. ఆలోచించి ఓటు వేయండని కోరారు.

ఫలితాల పైన ఉత్కంఠ
మంచు విష్ణుని గెలిపించండంటూ కోట చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు సైతం సిద్దం అయ్యాయి. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలుత ఈవీఎం ల ద్వారా పోలింగ్ అని డిసైడ్ అయ్యారు. అయితే, విష్ణు ప్యానెల్ ఈవీఎల పైన అభ్యంతరం వ్యక్తం చేయటంతో..బ్యాలెట్ పేపర్ల తో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో..10వ తేదీ రాత్రికి వస్తాయని భావిస్తున్న ఫలితాలు అర్ద్రరాత్రి సమయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications