Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సినిమా టిక్కెట్ల ధరపై మంచు విష్ణు తేల్చేసారు- చిరంజీవి చర్చల వేళ : కామెంట్స్ వైరల్..!!

ఏపీ ప్రభుత్వ వర్సస్ టాలీవుడ్ గా మారిన సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన "మా" అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఆయన ఈ వ్యవహారం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. "మా" అధ్యక్షుడు గా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయింది. దీంతో..ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం పైన స్పందించారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు దీని పైన భిన్న వ్యాఖ్యలు చేసారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి నేరుగా సీఎం జగన్ తో చర్చలు చేసారు. సీఎం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామంటూ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

చిరంజీవి చర్చల సమయంలో

చిరంజీవి చర్చల సమయంలో

త్వరలోనే మరోసారి భేటీ ఉంటుందని స్పష్టం చేసారు. అయితే, టిక్కెట్ల వ్యవహారం పైన "మా" అధ్యక్షుడిగా ఉన్న విష్ణు స్పందించకపోవటం పైన పలు చర్చలు సాగాయి. రాజకీయంగానూ విష్ణు ఎందుకు స్పందించరనే ప్రశ్నలు వినిపించాయి. ఈ సమయంలో ఎట్టకేలకు స్పందించిన విష్ణు.. సినీ పరిశ్రమలో టిక్కెట్ల ధరలు పెద్దలే పరిష్కారం చూస్తున్నారని... ఎవరికి వారు వ్యక్తిగతంగా అభిప్రాయాలు వెల్లడించకూడదని చెప్పుకొచ్చారు. వారంతా సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకంతోనే తాను మౌనంగా ఉన్నానంటూ వివరించారు.

అదే నా అభిప్రాయం అంటూ

అదే నా అభిప్రాయం అంటూ

టిక్కెట్ ధరలు తగ్గించటం పైన టాలీవుడ్ లో కొందరు హీరోలు ..సినీ పెద్దలు వ్యతిరేకించారు. ఇక, ఏపీలో సినిమా థియేటర్ల మూసివేత.. తరువాత థియేటర్ల యాజమన్యాలతో చర్చలు జరిగాయి. ఈ సమస్యల పైన ఛాంబర్ పెద్దలు మాట్లాడుతున్నారని..ఎవరికి వారు వ్యక్తిగతంగా..తమకు తోచినట్లుగా కామంట్స్ చేస్తే సమస్య మరింతగా పెరుగుతుందనే అభిప్రాయం విష్ణు వ్యక్తం చేసారు.

దాని కారణంగానే తాను మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ అంశం పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. "మా" అధ్యక్షుడుగా విష్ణు అభిప్రాయం చెప్పకపోవటం సరి కాదంటూ కొందరు అభిప్రాయపడుతుంటే..కీలక అంశం పైన చర్చలు జరుగుతున్న వేళ మౌనంగా ఉండటమే మంచిదంటూ మరి కొందరు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

ఈ నెలలోనే పరిష్కారం వస్తుందా

ఈ నెలలోనే పరిష్కారం వస్తుందా

ఇక, ఈ నెలాఖరులోగానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం జగన్ తో చర్చల తరువాత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత.. మరోసారి చిరంజీవి తో చర్చించి ఆ తరువాతనే జీవో ఇస్తామంటూ సీఎం హామీ ఇచ్చారంటూ చిరంజీవి స్పష్టం చేసారు. దీంతో...ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం వస్తుందనే ఉత్కంఠ అటు పొలిటికల్ గా ..ఇటు సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+