మెగాస్టార్ వద్దకు విష్ణు- మోహన్ బాబు..!! బాలయ్యతో భేటీ- లోకేశ్ ను ఓడించినా : 16న ప్రమాణ స్వీకారం..!!

"మా" ఎన్నికల తరువాత కొత్త టర్న్ తీసుకున్న వివాదాల వేళ..కొత్త అధ్యక్షుడు విష్ణు తన మార్గం డిసైడ్ చేసుకున్నారు. తనకు మద్దతుగా నిలచిన ప్రతీ ఒక్కరి ఆశీస్సలు తీసుకోవటం మొదలు పెట్టారు. ఒక వైపు ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచి కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసారు. అదే విధంగా ఫలితాలు వచ్చిన వెంటనే నాగబాబు..ఆ తరువాత అధ్యక్ష బరిలో పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ సైతం "మా" సభ్యత్వానికి రాజీనామా చేసారు. రాజీనామాల సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన ఇప్పటి వరకు విష్ణు స్పందించ లేదు.

ప్రముఖులతో విష్ణు-మోహన్ బాబు భేటీ

ప్రముఖులతో విష్ణు-మోహన్ బాబు భేటీ

అయితే, విష్ణు ఇప్పటికే "మా" అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక, ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16వ తేదీన ఉదయం 11.45 గంటలకు విష్ణు "మా" అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించటంతో పాటుగా..తమకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పేందుకు మోహన్ బాబు - విష్ణు ప్రముఖులను కలుస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్, సత్యనారాయణ, బ్రహ్మానందం ను వీరిద్దరూ కలిసారు. ఇక, కొద్ది సేపటి క్రితం నందమూరి బాలయ్యతో సమావేశమయ్యారు.

లోకేశ్ ను ఓడించినా..బాలయ్య మాత్రం

లోకేశ్ ను ఓడించినా..బాలయ్య మాత్రం

బాలయ్య సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. దీని పైన మోహన్ బాబు స్పందిస్తూ..తాను 2019 ఎన్నికల్లో బాలయ్య అల్లుడు (లోకేశ్) కు వ్యతిరేకంగా ప్రచారం చేసానని..అక్కడ వైసీపీ గెలిచిందని గుర్తు చేసారు. అయినా...అవన్నీ మర్చిపోయి తాను విష్ణుకు మద్దతు అడగగానే వెంటనే సానుకూలంగా స్పందిచారంటూ బాలయ్య సంస్కారాన్ని మెచ్చుకున్నారు. అదే విధంగా విష్ణు సైతం తనకు తన తండ్రి తరహాలోనే బాలయ్య సైతం అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇక, ఎన్నికల సమయం నుంచి ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన మెగా క్యాంపు లోని హీరోలను మోహన్ బాబు -విష్ణు కలవనున్నారు.

అందరూ కావాలి..అందరినీ కలుస్తా

అందరూ కావాలి..అందరినీ కలుస్తా

తాము అందరినీ కలుస్తానని..తాను అందరికీ బిడ్డ లాంటి వాడినని విష్ణు స్పష్టం చేసారు. మెగాస్టార్ ను తండ్రి మోహన్ బాబుతో పాలుగా ఈ సాయంత్రం లోగా కలవనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తనను పోటీ నుంచి తప్పుకోమన్నారంటూ ఫలితాల తరువాతి రోజున విష్ణు ఓపెన్ గా చెప్పారు. అదే విధంగా ఒక టీవీ ప్రోగ్రాంలో సైతం మోహన్ బాబు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక, ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా మెగా క్యాంపు పని చేసింది. విష్ణు గెలవగానే...సంకుచిత భావంతో వ్యవహరిస్తున్న వారితో తాను కలిసి ఉండలేనంటూ నాగబాబు రాజీనామా చేసారు.

మెగాస్టార్ వద్దకు తండ్రీ-తనయులు

మెగాస్టార్ వద్దకు తండ్రీ-తనయులు

ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకోకుండా..ముందుగా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పటం మోహన్ బాబు - విష్ణు లక్ష్యంగా కనిపిస్తోంది. దీని ద్వారా వారంతా తమ రాజీనామాలను ఉప సంహరించుకొని కలిసి పని చేసేందుకు ముందుకు వస్తారనేది విష్ణు టీం అంచనా. అయితే, ఇప్పుడు మోహన్ బాబు - విష్ణు వెళ్లి మెగాస్టార్ ను కలవటం ద్వారా ఈ వివాదానికి ముగింపు లభిస్తుందా.. లేక, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు తమ నిర్ణయం మీదే నిలబడి ఉంటారా అనేది కీలకంగా మారింది.

16న విష్ణు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

16న విష్ణు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

దీంతో పాటుగా ఈ నెల 16న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రకాశ్ రాజ్ ను సైతం విష్ణు ఆహ్వానించనున్నారు. అదే విధంగా గెలిచిన సభ్యులందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. వారికి విష్ణు స్వయంగా పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది. జరిగినవి అందరూ మర్చిపోయి..కలిసి పని చేయాలనే విధంగా విష్ణు వ్యవహార శైలి కనిపిస్తోంది. ఇప్పుడు విష్ణు చేస్తున్న ప్రయత్నాలకు మెగా క్యాంపు నుంచి ఎటువంటి సహకారం వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ప్రకాశ్ రాజ్ తోనూ విష్ణు రాజీ ఫార్ములా

ప్రకాశ్ రాజ్ తోనూ విష్ణు రాజీ ఫార్ములా

తన ప్యానల్ లోని బెనర్జీ పైన మోహన్ బాబు చేయి చేసుకున్నారంటూ ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వీటికి మోహన్ బాబు - విష్ణు ఎటువంటి వివరణ ఇచ్చి. .వారిని తమకు మద్దతుగా కూడగడుతారనేది కీలకంగా మారుతోంది. అదే విధంగా నరేశ్ భవిష్యత్ పాత్ర పైన స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో..ఈ రెండో రోజుల్లో చోటు చేసుకొనే పరిణామాలు "మా" భవిష్యత్ ..అదే విధంగా విష్ణుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+