మాచర్ల: పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం ఎన్నికల సిబ్బందిపై ఈసీ వేటు
పల్నాడు: మాచర్ల పోలింగ్ కేంద్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా ఆ సమయంలో విధుల్లో పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఘటన సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్‌లో అడుగు పెట్టిన సమయంలో అక్కడ ఉన్న పీవో, ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేశారని, సంఘటన సమయంలో వారిని వ్యతిరేకించలేదనే అభియోగాలతో సస్పెండ్ చేసింది.
గురువారంలోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం సదరు సిబ్బందిని ఆదేశించింది. ఈ ఘటనపై పాల్వాయిగేటు పోలింగ్ కేంంద్రం పీఓ సరియైన సమాధానం ఇవ్వలేదని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.

ఈవీఎంల ధ్వంసం: ఈసీ సీరియస్
కాగా, పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని వివరించారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు.
ఈవీఎం ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని సీఈవో చెప్పారు. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారని ఎంకే మీనా పేర్కొన్నారు. మే 20న కోర్టులో రెంటచింతల ఎస్‌ఐ మెమో దాఖలు చేశారని, ఏ-1 నిందితుడిగా పిన్నెల్లిని ఎస్సై పేర్కొన్నారని తెలిపారు. పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని.. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందన్నారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని సీఈవో వెల్లడించారు.
పిన్నెల్లి అరెస్ట్!
పోలింగ్ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఉదయం నుంచి గాలించిన పోలీసులు, ఎట్టకేలకు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి విఫల యత్నం చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications