పవన్‌ కాదు తుఫాన్‌..లోక్‌ సభలో మార్మోగిన జనసేన అధినేత పేరు

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, జనసేన అభ్యక్షులు పవన్‌ కల్యాణ్‌పై ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పొగడ్తలతో ముంచేశారు. లోక్‌ సభ ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఈ రోజు జరిగిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. తొలుత స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గడిచిన ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్‌ చేసి పోరాటం, పోటీ చేసిన ప్రతి స్థానంలో ఏ విధంగా గెలిచారు అన్న అంశాలను ఒక్కొక్కటిగా ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చడానికి ఎన్డీయే కూటామి ఏర్పాటుకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన త్యాగం గురించి సభలో ప్రస్తావించారు.

పవన్‌ నిజంగానే తుఫాన్‌ ఎందుకంటే..
దేశంలో ఎన్డీయే కూటమి గెలుపొందిన తర్వాత తొలిసారి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. పవన్‌ అంటే కేవలం పవన్‌ కాదని.. పవన్‌ అంటే ఆందీ(తుపాన్‌) అని ప్రశంశించారు. ఇక ప్రధాని మోదీ మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఎంపీ బాలశౌరి.. పవన్‌ నిజంగానే ఏపీ రాజకీయాల్లో తుఫాన్‌ సృష్టించారని, ప్రత్యర్థులను మట్టికరిపించారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. భారతదేశంలో మరే పార్టీ సాధించని ఘన విజయం తన పార్టీ జనసేన సాధించిందని ఎంపీ పేర్కొన్నారు.

Machilipatnam MP Vallabhaneni Balasouri praises Pawan Kalyan

140 కోట్ల మంది ప్రజలు ఉన్న మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రెయిక్ రేట్‌ సాధించిన పార్టీ జనసేన మాత్రమే అని.. ఇలాంటి ఘనత సాధించడం దేశ చరిత్రలోనే ప్రధమం అని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ఇక ఎంపీ బాలశౌరి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురించి లోక్‌సభలో మాట్లాడిన వీడియో చెక్కర్లుకొడుతోంది. పవన్‌ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను విపరీతంగా వైరల్‌ చేస్తున్నారు. లోక్‌సభలో ఓ పార్టీ అధ్యక్షుడి గురించి ఇంత గొప్పగా చెప్పిన ఎంపీని తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్లు పెడుతుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+