సిమి కార్యకర్తలేనని తేల్చిన ఎంపీ పోలీస్, ఎన్నో ఘోరాలు: ఆ ముగ్గురెక్కడ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందింది సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలేనని మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం సాయంత్రం తేల్చి చెప్పారు. శనివారం నాటి ఎన్‌కౌంటర్‌లో జకీర్, అస్లాం అనే ఇద్దరు దుండగులు మృతి చెందిన విషయం తెలిసిందే.
వీరిద్దరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జైలు నుండి పారిపోయి వచ్చిన సిమి ఉగ్రవాదులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు జైలు నుండి తప్పించుకుపోయిన వ్యక్తులు చిత్రాలు, వేలిముద్రలతో వచ్చారు.
ఆసుపత్రిలో జకీర్, అస్లాం మృతదేహాలను పరిశీలించి.. వారు ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులేనని తేల్చి చెప్పారు. అంతేకాదు, వారు ఎన్నో ఘాతుకాలకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. వారు ఖాండ్వా జైలు నుండి తప్పించుకునే ప్రయత్నంలో అక్కడి పోలీసును కూడా కాల్చి చంపారు.

సూర్యాపేటలో ఇద్దరు పోలీసులను కాల్చి చంపిన వారు వీరేనని పోలీసులు ఇప్పటికే భావిస్తున్నారు. అలాగే, చొప్పదండిలో బ్యాంకు రాబడీ చేసిన వారు వీరే అని భావిస్తున్నారు. గతంలో రైలులో వచ్చిన సమయంలో వినోద్ టొప్పోది అనే జార్ఖండ్ వ్యక్తిని బెదిరించి అతని నుండి ఓటర్ కార్డు, గుర్తింపు కార్డు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మృతి చెందిన సిమి కార్యకర్తలు అస్లాం, జకిర్‌ల జేబులలోని పర్సు, సెల్ ఫోన్‌లను పోలీసులు గుర్తించారు. వాటిలో వినోద్‍ను బెదిరించి తీసుకున్న గుర్తింపు కార్డు, ఓటర్ కార్డులు పోలీసులు గుర్తించారని సమాచారం. సైబరాబాద్ పరిధిలో బస్సుల్లో ప్రయాణీకులను బెదిరించి బ్యాంగులు దొంగిలించింది కూడా వీరేనని అనుమానిస్తున్నారు.
పది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు బస్సుల్లో తిరుగుతున్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వీరిపై అనేక కేసులు ఉన్నాయని తెలుస్తోంది. 2007లో కేరళలో తీవ్రవాద శిక్షణ కేంద్రాన్ని నిర్వహించారని సమాచారం. 2010లో భోపాల్‌లో ఓ బంగారు దుకాణంలో చోరీ చేశారు.
ఆ ముగ్గురి కోసం కూంబింగ్

వరంగల్ - నల్గొండ సరిహద్దుల్లో మూడో నిందితుడి కోసం పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం సూర్యాపేట కాల్పుల ఘటనలో ఇద్దరు పోలీసులను పొట్టన పెట్టుకుంది, నిన్నటి జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందింది ఒకే గ్రూపుకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. సూర్యాపేట కాల్పుల్లో ఇద్దరు పోలీసులను చంపిన సమయంలో ముగ్గురు ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
శనివారం నాటి ఎన్ కౌంటర్లో మాత్రం ఇద్దరు (జకీర్, అస్లాం)లు చనిపోయారు. ఈ నేపథ్యంలో మూడో వ్యక్తి పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని కోసం పోలీసులు వరంగల్, నల్గొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా ఖాండ్వా జైలు నుండి ఐదుగురు పారిపోయినట్లుగా చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు కూడా ఎక్కడున్నారని పోలీసులు వెతికే పనిలో పడ్డారు. జైలు నుండి పారిపోయిన వారిలో ఇద్దరు (అస్లాం, జకీర్) మృతి చెందగా, మరో ముగ్గురు బయటే ఉన్నారు. వారు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
అతను మూడో వ్యక్తియా?
వరంగల్ - నల్గొండ సరిహద్దుల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ నిరవహిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని కుక్కడం గ్రామంలో ఓ వ్యక్తి హిందీలో మాట్లాడారని, దీంతో గ్రామస్థులు అతని గురించి ఆరా తీశారని తెలుస్తోంది. వారు పోలీసులకు ఈ విషయమై సమాచారం అందించారు. అతను వరంగల్ జిల్లాలోని ఓ గ్రామం వైపుకు వెళ్లినట్లుగా గ్రామస్తులు చెప్పారు. అతను పోలీసులు వెతుకుతున్న మూడో వ్యక్తియా తెలియాల్సి ఉంది.
హైఅలర్ట్
జైష్ ఎ మహమ్మద్ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టిదిట్టం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications