తోపుదుర్తి సోదరులు చంపాలని చూస్తున్నారు - మహానందరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరులు తనపై ప్రాణహానికి కుట్ర పన్నుతున్నారని వైసీపీ బహిష్కృత నేత మహానందరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రాణహాని..
ఈ మేరకు మహానందరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రకాశ్‌రెడ్డి తనను హత్య చేయాలని యత్నించారని, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం కొనసాగుతోందని ఆరోపించారు. అమెరికాలో ఉన్న తన అన్న కుమారుడికి ఫోన్ చేసి "మీ చిన్నాన్నను చంపేస్తాం" అని బెదిరించారని వెల్లడించారు. ప్రస్తుత అధికార పార్టీ నేతలతో ప్రకాశ్‌రెడ్డి లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు..
ఈ కుట్రలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కూడా భాగస్వామి అయ్యారని మహానందరెడ్డి ఆరోపించారు. పోలీసులను ఒత్తిడి చేసి తనను అక్రమంగా అరెస్టు చేయించి, హత్య చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ కక్షల కారణంగా ఇప్పటికే తన కుటుంబంలోని ఇద్దరిని కోల్పోయానని, ఇప్పుడు తన ప్రాణానికే ముప్పు ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భూకబ్జాల ఆరోపణలు..
అంతే కాకుండా ప్రకాశ్‌రెడ్డి అనేక భూకబ్జాలు చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మహానందరెడ్డి స్పష్టం చేశారు. ఉప్పరపల్లిలోని వంక పోరంబోకు భూములను, బెంగళూరు రోడ్డులో మాజీ సైనిక ఉద్యోగి పేరుతో సృష్టించిన భూములను ప్రకాశ్‌రెడ్డి అక్రమంగా కాజేశారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలన్నీ తాను త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. ఈ విషయాలు బయటకు రాకముందే తనను అడ్డుకోవాలని ప్రకాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు తన అన్న ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో ఉన్న నిందితులను ప్రకాశ్‌రెడ్డి తన వెంట తిప్పుకుంటున్నారని మహానందరెడ్డి తెలిపారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో తన భార్య 33 ఓట్ల మెజారిటీతో గెలిచినా, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని గుర్తుచేశారు. రాజకీయ కుట్రలతోనే తన కుటుంబం నిరంతరం నష్టపోతోందని ఆయన ఆరోపించారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications