వరద బాధితులకు మహేష్ బాబు భారీ విరాళం..ఏపీ, తెలంగాణకు వేరు వేరుగా
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకొచ్చారు.మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం నిమిత్తం రూ.కోటి రూపాయల విరళాన్ని ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, వరద బీభత్సానికి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న మహేష్ బాబు.. నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్టు ప్రకటించారు.
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…
— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024
ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం.. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నానని మహేష్ బాబు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. వరదల వల్ల అతలకుతలం అయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ హీరోలు ముందుకు వస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.

జూ.ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం అందచేశారు.విశ్వక్ సేన్ రెండు రాష్ట్రాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు. రాష్ట్రానికి రూ.15 లక్షల చొప్పున సిధ్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం సీఎం సహాయనిధికి అందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతలైన రాధాకృష్ణ, నాగవంశీ. ముగ్గురు కలిపి రెండు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు నిర్మాత అశ్వినీదత్. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం అందజేశారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications