ఆ దర్శకుడికి 'నో' చెప్పిన మహేష్ బాబు

సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఒక చిత్రమైన వాతావరణం నెలకొంటుంది. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు.. అలాగే ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో కూడా నాడికి అందదు. బ్రహ్మాండంగా తీశాం.. సినిమా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని యూనిట్ పెట్టుకుంటే అది ఫ్లాపవుతుంది. ఎందుకు ఫ్లాపైందో, అందులోని లోటుపాట్లేమిటో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సినిమా సరిగా రాలేదు.. ఏదో వచ్చినట్లు తీశాం.. నచ్చినట్లు చూడండి అనే ధోరణిలో కొన్ని సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి.

అలాంటి సినిమాలు విడుదలైనప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. మరికొన్ని సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తాయి. అటువంటి చిత్రమైన వాతావరణంలో పరిశ్రమలోని వారంతా దాదాపుగా సెంటిమెంట్లపై ఆధారపడతారు. ప్రతి హీరోకు, దర్శకుడికి, హీరోయిన్ కు, నిర్మాతకు... ఇలా అన్ని విభాగాల్లో ఉన్నవారికి సెంటిమెంట్లు ఉంటాయి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న సెంటిమెంట్ ఏమిటంటే.. రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో సినిమా చేస్తాడో.. ఆ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అవుతుంది.. అలాగే ఆ హీరో తర్వాత చేసే సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది అని.

mahesh babu not accepted mehar ramesh story

రాజమౌళి దర్శకత్వంలో గతంలో హీరోలుగా చేసివారందరికీ ఈ తరహా అనుభవాలు ఎదురవడంతో అందరూ మహేష్ బాబు రాజమౌళి చిత్రం తర్వాత ఏ చిత్రం చేస్తాడా? అంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే భోళాశంకర్ లాంటి ఇండస్ట్రీ ఫ్లాప్ నిచ్చిన మెహర్ రమేష్ ఒక కథ పట్టుకొని మహేష్ బాబు దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కథ బాగున్నప్పటికీ సింపుల్ గా ప్రిన్స్ నో చెప్పేశారు.

అసలే సెంటిమెంట్ ఒకటి వెంటాడుతోంది.. దానికితోడు మెహర్ రమేష్ సినిమా అనగానే అదే సెంటిమెంట్ నిజమవుతుందనేది అందరికీ ముందే అర్థమైపోతుంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న మహేష్ బాబు మెహర్ రమేష్ కు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. సాధారణంగా మహేష్ బాబు ఇటువంటి నమ్మకాలను పట్టించుకోడు. వీటికి అతీతంగానే సినిమాలు చేస్తుంటాడు. కానీ రాజమౌళి తర్వాత చేయబోయే చిత్రం ఫ్లాపవుతుందనే భయంతోనే మెహర్ రమేష్ కు నో చెప్పాడంటే ప్రిన్స్ కూడా వీటిని నమ్ముతున్నాడా? అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+