తంత్రం లేని సేనాని: పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి తాజా వ్యాఖ్య
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరో వ్యాఖ్య చేశారు. పవన్ కల్యాణ్ పేరెత్తకుండా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత వ్యాఖ్యలకు దూరంగా ఉంటానని, అయితే విమర్శలు చేసే విషయంలో తాను వెనక్కి తగ్గబోనని మహేష్ కత్తి పవన్ కల్యాణ్ అభిమానులకు మాట ఇచ్చారు. ఈ మాట ప్రకారం ఆయన పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు.

తంత్రం లేని సేనాని అని...
తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం అంటూ మహేష్ కత్తి పవన్ కల్యాణ్‌ను, ఆయన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సమస్య ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని ఆయన అన్నారు.

ఇప్పటికీ ఆలస్యం కాలేదని...
ఇప్పటికీ ఆలస్యం కాలేదని మహేష్ కత్తి అన్నారు. ఎదో ఒకటి చేయవచ్చునని, కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలు వచ్చేలోగా ఎంతో కొంత మార్చవచ్చునని ఆయన అన్నారు. కరువు పీడిత జిల్లా అనంతపురంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల మహేష్ కత్తి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.
Recommended Video


టిడిపితో పొత్తు విషయంపై ఆలోచిస్తా...
ప్రజాభీష్టం మేరకు టిడిపితో పొత్తు విషయంపై ఆలోచిస్తానని పవన్ కల్యాణ్ ఆదివారంనాు అన్నారు. శిలాఫలకాలు వేసి మరిచిపోయేవారికి కాకుండా అభివృద్ధి చేసేవారికి తన మద్దతు ఉంటుందని ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో చెప్పారు.

ఎక్కడి నుంచి పోటీ చేసేది...
తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. సమయం వచ్చిప్పుడు ప్రకటిస్తానని ఆయన చెప్పారు. కష్టాలు ఎక్కడు ఉంటాయో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని, అందుకే తాను అనంతపురాన్ని దత్తత తీసుకున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications