వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టప్ప తలపై బాహుబలి కాలు: బిజెపిపై మహేష్ కత్తి సెటైర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నెటిజన్లు కూడా బిజెపిపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇదే సమయంలో సినీ క్రిటిక్ మహేష్ కత్తి బిజెపిపై వ్యంగ్యాస్త్రం విసిరారు.

బిజెపి ప్రభుత్వంపై, కేంద్ర బడ్జెట్‌పై ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు బాహుబలి సినిమా పోస్టర్ తీసుకుని బిజెపి ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతోందని వ్యంగ్యమై వ్యాఖ్య చేశారు.

 కట్టప్ప తలపై బాహుబలి కాలు

కట్టప్ప తలపై బాహుబలి కాలు

బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలు పెడుతున్న దృశ్యాన్ని మహేష్ కత్తి పోస్టు చేసి కట్టప్పను బిజెపిగా, బాహుబలిని మధ్యతరగతిగా పోల్చి ఇది 2014 పరిస్థితి అని వ్యాఖ్యానించారు.

 బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచే...

బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచే...

బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచే దృశ్యాన్ని తీసుకుని కట్టప్పను బిజెిగా, ప్రభాస్‌ను మధ్యతరగతి ప్రజలుగా చిత్రించి ఇది 2018 పరిస్థితి అని మహేష్ కత్తి రాశారు. 2014, 2018ల్లో బిజెపి ప్రభుత్వంలో ప్రజలున్న పరిస్తితికి ఇది పర్‌ఫెక్టుగా సరిపోతుందని ఆయన అన్నారు.

 ఏవీ లేవని మహేష్ కత్తి..

ఏవీ లేవని మహేష్ కత్తి..

"రాజధానికి లేవు. కేంద్ర విద్యాసంస్థలకి లేదు. గిరిజన యూనివర్సిటీకి లేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి లేదు. ప్రాజెక్టులకు లేదు. లోటు బడ్జెట్ కి లేదు. ఇంక ఏముంది ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్లో!?!" అని మరో వ్యాఖ్యను మహేష్ కత్తి పోస్టు చేశారు.

ఎంపీలపై ఇలా కామెంట్..

ఎంపీలపై ఇలా కామెంట్..

"పనికిరాని బడ్జెట్టు. పనికిరాని ఆంధ్రా ఎం.పి లు. ఇదివరకు చేవలేదనే అనుకున్నా, ఇప్పుడు చేతకాదని కూడా అర్థం అయింది. ఈసారి బిజెపి కి ఎవరు మద్దత్తు తెలిపినా, వాళ్లకు సామాన్య ప్రజలు మద్దత్తు ఇవ్వరు" అని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.

English summary
Cine critic Mahesh Kathi satires on BJP using Bahubali Movie posters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X