ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉందో తెలుసా?

ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన భారతదేశంలోనే నిర్మాణం జరుపుకుంటోంది. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై దీన్ని నిర్మిస్తున్నారు. అతి ఎత్తైన ఈ రైల్వే బ్రిడ్జిని త్వరలోనే జాతికి అంకితం చేయనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వంతెన నిర్మాణ పనులను సమీక్షించారు. అంతేకాదు.. స్వయంగా ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ ఎత్తు. ఈ వంతెనపైకి చేరుకోవడానికి రైల్వే శాఖ తొలిసారిగా ఒక మహింద్రా బొలెరో వాహనాన్ని పట్టాలపై నడిపింది. రైలు పట్టాలపై ప్రయాణించేందుకు అనుగుణంగా ఈ వాహనం టైర్లకు ముందు, వెనుక భాగంలో చక్రాలను అమర్చారు. ఇంత ఎత్తైన బ్రిడ్జిపైకి వెళ్లిన తొలి వాహనంగా మహింద్రా బొలెరో రికార్డులకెక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

track

రూ.1400 కోట్లతో నిర్మాణమవుతున్న ఈ రైల్వే వంతెన భారతదేశానికే గర్వకారణంగా నిలవనుంది. రైల్వే వంతెన భద్రతపై చేయాల్సిన పరీక్షలన్నీ పూర్తయ్యాయి. వంతెన స్థిరంగా ఉంటుందా? భూ కంపం వస్తే తట్టుకుంటుందా? నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి? ఆ సమయంలో భూమి ఎలా స్పందిస్తుంది.. తదితర పరీక్షలను విజయవంతంగా భారతీయ రైల్వే నిర్వహించింది.

track
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+