దోపిడీ: పనిమనిషిని చంపి కప్‌బోర్డులో దాచి పెట్టారు

murder
హైదరాబాద్/ ఒంగోలు: హైదరాబాద్ నగరంలోని అల్వాల్‌ భూదేవి నగర్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అద్దెకు ఇల్లు కావాలంటూ దంపతుల రూపంలో వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పని మనిషిని హత్య చేశారు. అనంతరం మతదేహాన్ని ఇంట్లో కప్‌బోర్డులో దాచి దుండగులు పరారయ్యారు. దీన్ని గుర్తించిన ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వ్యాపారి ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌ హఫీజ్‌పేటలో వ్యాపారి సోమేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజమండ్రి పోలీసులు వేధిస్తున్నారనే మనస్థాపంతో సోమేష్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమేష్ కు రాజమండ్రిలో భారీగా అప్పులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చిన్నారి సురక్షితం

ఇదిలావుంటే హైదరాబాద్ నగరంలోని మార్కెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న(మంగళవారం) అపహరణకు గురైన ఆరు నెలల చిన్నారి మోసాబ్ సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని ఎత్తుకెళ్ళిన ఇద్దరు కిడ్నాపర్లను శేరిలింగంపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కాగా, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం వూళ్లపాలెంలో ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పురమి గోపి, అదే గ్రామానికి చెందిన సౌజన్య బుధవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగారు. పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో వారిని ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+