వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీబీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, రూ. 18 కోట్ల నష్టం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/నల్గొండ: నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌లోని శ్రీయం అగ్రో కెమికల్ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మిసైల్ ట్యాంకర్‌ను అన్‌లోడ్ చేస్తుండగా నిప్పు రాజుకుని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు బీబీనగర్, చౌటుప్పల్ ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. కాగా ఈ ప్రమాదంలో సుమారు 18 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. బీబీనగర్ పట్టణానికి ప్రమాదం జరిగిన కంపెనీ సమీపంలోనే ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో స్థానికులను అధికారులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటన చోసుకున్న తర్వాత అక్కడి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

Major fire breaks out at chemical factory in Nalgonda

హెటిరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలం పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి(సెచ్)లోని హెటిరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని యూనిట్-5 గదిలో నిల్వ ఉన్న రసాయన గదిలో ప్రమాదశాత్తూ మంటలు చెలరేగాయి. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదం సంభవించిన సమయంలో కర్మాగారంలో సుమారు 1500 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్మికులు అక్కడినుంచి బయటికి పరుగులు తీశారు. దీంతో ప్రాణపాయం తప్పింది.

English summary
A chemical factory in Nalgonda in Andhra Pradesh caught fire on Monday afternoon. It caused massive amounts of thick smoke in the air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X